ఈటల రాజేందర్ కు బిగ్ షాక్... తిరిగి టీఆర్ఎస్ గూటికి జమ్మికుంట వైస్ ఛైర్మన్

By Arun Kumar PFirst Published Jul 27, 2021, 1:18 PM IST
Highlights

హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ మాజీ మంత్రి ఈటలకు వరుస షాక్ లు ఇస్తోంది. 

కరీంనగర్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రజా దీవెన పేరిట పాదయాత్ర చేస్తున్న ఆయనకు జమ్మికుంట మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న, ఇల్లందకుంట రామాలయ మాజీ ఛైర్మన్ దేశిని కోటి షాకిచ్చారు. ఈటల బిజెపిలో చేరడంతో ఆయన వెంటే నడిచిన ఈ దంపతులు తాజాగా బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. 

హుజురాబాద్ లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాము మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట నడిచినట్లు దేశిని దంపతులు తెలిపారు. ఇలా బిజెపి పార్టీలో చేరినప్పటికి గెలిచింది మాత్రం టీఆర్ఎస్ కారు గుర్తుపైనే అని అన్నారు. కాబట్టి మా వార్డులో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామన్నారు. ఇకపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నాయకత్వంలో పనిచేస్తామంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు దేశిని స్వప్న, కోటి దంపతులు. 

read more  కేసీఆర్ హుజూరాబాద్ ఆపరేషన్: టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి, ఇటీవలే కౌశిక్ రెడ్డి

దేశిని దంపతులు తిరిగి టీఆర్ఎస్ లో చేరడంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రమేయం ఎక్కువగా వున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి తనకు దగ్గరి బంధువులు అయిన దేశిని దంపతులతో రహస్యంగా మంతనాలు జరిపారు. బంధువులు కావడం వల్లే వీరిని కలిసినట్లు మంత్రి చెప్పినా అప్పుడే దేశిని దంపతులు తిరిగి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాయబారం ఫలించి దేశిని దంపతులు టీఆర్ఎస్ లో చేరారు. 
 

click me!