కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి

Published : Mar 03, 2021, 04:37 PM IST
కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.  

భువనగరి: తెలంగాణ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లతో పోల్చిన కేసీఆర్ ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు.ఐకేపీ సెంటర్లను తొలగిస్తే రైతులు టీఆర్ఎస్  నేతలను గ్రామాల్లో తిరగనివ్వరన్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన కోరారు.

ఇటీవల కాలంలో టీఆర్ఎస్ సర్కార్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ విమర్శలు చేస్తున్నారు. బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలపై  దృష్టిని కేంద్రీకరించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసింది.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !