సింగరేణిలో రూ. 40 వేల కోట్ల అవినీతిని త్వరలోనే బయటపెడతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో ఏం చేస్తున్నారని కేసీఆర్ సర్కార్ ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
నల్గొండ: Singareni లో రూ. 40 వేల కోట్ల అవినీతిని త్వరలోనే బయటపెడతానని భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy చెప్పారు. బుధవారం నాడు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు.సింగరేణిలో అవినీతిని ప్రజలకు వివరిస్తానన్నారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరూ కూడా అదానీకే దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరూ కూడా దొంగలేనన్నారు.
హైద్రాబాద్ ను కేటీఆర్ అదానీబాద్ గా మార్చాలని చూస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. అదానీ కంపెనీతో కేసీఆర్ బంధువు ప్రతిమ శ్రీనివాసరావు రూ. 60 వేల కోట్లతో కోల్ మైన్ ఎలా లీజ్ కు ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. మీరు సింగరేణిో ఏం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణిలో చోటు చేసుకొన్న అవినీతిని ఆధారాలతో బయటపెడతానన్నారు.
ఈ విషయమై హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ లీజ్ ను తాను క్యాన్సిల్ చేయించే వరకు పోరాటం చేస్తానన్నారు. ఇతర కాంట్రాక్టర్లు రూ. 20 వేల కోట్లకే ఈ లీజుకు సిద్దమైతే రూ. 60 వేల కోట్లకు తమ బంధువుకు సింగరేణి మైనింగ్ లీజును కట్టబెట్టారని కోమటిరెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ లో కూడా ఇదే విషయమై తాను లేవనెత్తుతానని చెప్పారు. ఈ అవినీతిని వెలికితీసేందుకు తాను ఏడు మాసాలుగా పోరాటం చేస్తానని చెప్పారు.