బండసోమారం సబ్ స్టేషన్ లో రికార్డుల పరిశీలన: ఉచిత విద్యుత్ పై కేటీఆర్ కు కోమటిరెడ్డి మరోసారి సవాల్

By narsimha lode  |  First Published Jul 13, 2023, 5:05 PM IST

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్లు  కొనసాగుతున్నాయి.  10 గంటల కంటే ఎక్కువ ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు నిరూపిస్తే  రాజీనామా చేస్తానని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. 


హైదరాబాద్: వ్యవసాయానికి  10 గంటల కంటే  ఎక్కువ ఉచిత విద్యుత్ ను  ఇస్తున్నట్టుగా నిరూపిస్తే  రాజీనామా చేస్తానని  భువనగిరి  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి  మంత్రి కేటీఆర్ కు  సవాల్ విసిరారు.

గురువారం నాడు  భువనగిరి మండలం  బండ సోమారం విద్యుత్ సబ్ స్టేషన్ ను  పార్టీ కార్యకర్తలతో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఇవాళ  సందర్శించారు. రైతులకు  ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారో  సబ్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు.  వ్యవసాయానికి విద్యుత్ ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారనే  విషయాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  విద్యుత్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 10 నుండి  11 గంటల కంటే  విద్యుత్ ను సరఫరా చేయడం లేదని విద్యుత్ సిబ్బంది  తమ దృష్టికి తెచ్చారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా  బీఆర్ఎస్ నేతలు  మాట్లాడుతున్నారన్నారు.  బీఆర్ఎస్ నేతలు  తిన్నది అరగకుండా ధర్నాలు  చేస్తున్నారని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Latest Videos

click me!