బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా దంపతులదే కీలకపాత్ర: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్

By narsimha lodeFirst Published Jan 6, 2021, 4:53 PM IST
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్  పాత్ర ఉందని తేలిందని  హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు.

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్  పాత్ర ఉందని తేలిందని  హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు.

బుధవారం నాడు సాయంత్రం తన కార్యాలయంలో ఆయన బోయిన్‌పల్లి కిడ్నాప్ నకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో భూమా అఖిప్రియ దంపతులతో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందన్నారు.

ఆదాయ పన్ను శాఖాధికారుల మాదిరిగా నకిలీ గుర్తింపు కార్డులను  ఉపయోగించారని ఆయన చెప్పారు. కిడ్నాపర్లు ఉపయోగించిన కార్లకు నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగించారని చెప్పారు.  15 బృందాలుగా గాలించి కిడ్నాపర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. 
ఈ కేసులో  ఏ-1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ-2 గా భూమా అఖిలప్రియ, ఏ-3 గా  భార్గవ్ రామ్ ను చేర్చామని సీపీ వివరించారు.

also read:హైద్రాబాద్‌లో కిడ్నాప్: బేగంపేట పోలీస్‌స్టేషన్ లో భూమా అఖిలప్రియ విచారణ

ఐటీ అధికారులంటూ ప్రవీణ్ రావు తో పాటు ఆయన సోదరులను మంగళవారం నాడు రాత్రి కిడ్నాప్ చేశారని ఆయన తెలిపారు. హఫీజ్ పేటలో భూ వివాదం తలెత్తిందని..ఈ వివాదంలో భాగంగానే ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.

సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకొన్నామని ఆయన చెప్పారు. అఖిలప్రియపై 448,419,341,342,506,366,149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. 

హఫీజ్‌పేటలో 25 ఎకరాల భూ వివాదంపై ఈ కిడ్నాప్ జరిగిందని తమ విచారణలో తేలిందని ఆయన వివరించారు.

click me!