గాంధీభవన్‌లో టీ.కాంగ్రెస్ కీలక సమావేశం.. డుమ్మాకొట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Siva Kodati |  
Published : Apr 29, 2022, 08:41 PM IST
గాంధీభవన్‌లో టీ.కాంగ్రెస్ కీలక సమావేశం.. డుమ్మాకొట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సారాంశం

తెలంగాణ  కాంగ్రెస్‌లో సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చనీయాంశంగా మారారు. రేవంత్ రెడ్డి నల్గొండలో సమావేశం పెట్టాల్సిన అవసరం లేదన్న ఆయన.. శుక్రవారం గాంధీ భవన్‌లో జరిగిన కీలక సమావేశానికి డుమ్మాకొట్టారు. 

టీ కాంగ్రెస్ తదుపరి కార్యచరణపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. త్వరలో తెలంగాణకు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించబోతోన్న నేపథ్యంలో పార్టీలో ఏర్పడిన లుకలుకలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా గాంధీభవన్‌కు వచ్చిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణికం ఠాగూర్‌కు (manickam tagore) టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) స్వాగతం పలికారు. అలాగే ఈ సమావేశానికి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కూడా హాజరుకావడంతో ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయన్న టాపిక్ ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో హైకమాండ్ ఎదైనా కఠిన నిర్ణయం తీసుకోబోతుందా అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. 

మరోవైపు నల్గొండ జిల్లా Nagarjuna Sagarలో టీపీసీసీ చీఫ్ Revanth Reddy సమావేశం నిర్వహించవద్దని Congress  పార్టీ స్టార్ క్యాంపెయినర్ Komatireddy Venkat Reddy చేసిన వ్యాఖ్యలపై ఎఐసీసీ ఆరా తీసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను  ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు పార్టీ నాయకత్వానికి పంపారు.

అంతకుముందు Nalgonda లో రేవంత్ రెడ్డి సమావేశం అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. మే 6న Warangal లో Rahul Gandhi సభ కు జన సమీకరణకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన వంటి ఫహిల్వాన్ లాంటి నేతలు ఉన్నారని ఆయన చెప్పారు. పార్టీ బలహీనంగా ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటించాలని ఆయన సూచించారు. 

నాగార్జునసాగర్ సమావేశం కంటే మూడు రోజుల ముందే నల్గొండలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం గురించి తమకు సమాచారం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, Uttam kumar Reddy లు సమావేశాన్ని రద్దు చేయించారు. ఈ విషయమై Jana Reddy తో చర్చించారు. అయితే పీసీసీ చీఫ్ ను జిల్లా పర్యటనకు రాకుండా అడ్డుకోవడం సమంజసమా అని జానారెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు నాగార్జునసాగర్ లోనే జానారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటనకు తాను వెళ్తున్నందున నాగార్జునసాగర్ టూర్ కి తాను హాజరు కాబోనని రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మేసేజ్ పంపారు. ఇదిలా ఉంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించొచ్చని ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజ్ తేల్చి చెప్పారు. ఎవరి అనుమతిని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?