తెలంగాణ ముఖ్యమంత్రిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు.
హైదరాబాద్ : తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం లోపు సస్పెన్షన్ కు తెరపడనుంది. నిన్న రాత్రి ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీచేరుకున్నారు. భట్టి, ఉత్తమ్ లు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా కలవనున్నట్లు సమాచారం.
అక్కడ ఏఐసీసీ నిర్ణయం మేరకు సీల్డ్ కవర్ తో మధ్యాహ్నం హైదరాబాదుకు డీకే శివకుమార్, ఠాక్రే రానున్నారు. ఆ తరువాత ఎమ్మెల్యేల సమక్షంలో సీల్డ్ కవర్ ఓపెన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో ఖర్గేతో డీకే, ఠాక్రే సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.