భారత్ జోడో యాత్ర: తెలంగాణలో రెండు రోజులు రాహుల్ పాదయాత్రకు బ్రేక్

By narsimha lode  |  First Published Oct 11, 2022, 10:42 AM IST

భారత్ జోడోయాత్రకు రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతరాహుల్ గాంధీ విరామం ఇవ్వనున్నారు.  దసరా సందర్భంగా  రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 24,25 తేదీల్లో రాహుల్ గాంధీ తన పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. 


హైదరాబాద్: భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించిన తర్వాత రెండు రోజుల పాటు పాదయాత్రకు కాంగ్రెస్  పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విరామం ఇవ్వనున్నారు.  దీపావళి పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీపావళి రోజున కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత రాహుల్ గాంధీ  తిరిగి పాదయాత్రలో పాల్గొంటారు. 

ఈ నెల 23న మధ్యాహ్నం రాహుల్ గాంధీ  యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మధ్యాహ్నం వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. మధ్యాహ్నం  శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి  రాహుల్ గాంధీ ఢీల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులు దీపావళిని  కటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంటారు.  ఈనెల 25 న సాయంత్రం రాహుల్ గాంధీ తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో మక్తల్ నియోజకవర్గానికి చేరుకుంటారు. 

Latest Videos

undefined

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ  నెల 4, 5 తేదీల్లో   రాహుల్ గాంధీ తన  పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 3వ తేదీనే  కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కూడ కర్ణాటకకు చేరుకున్నారు. దసరా పర్వదినాన్ని సోనియాగాంధీ కర్ణాటకలో జరుపుకున్నారు. ఈ నెల 6వ తేదీన సోనియాగాంధీ రాహుల్ గాంధీతో కలిసి కొద్దిసేపు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో పాల్గొన్న తర్వాత సోనియా గాంధీ తిరిగి ఢిల్లీకి వెళ్లారు.

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా నుండి తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించనుంది. తెలంగాణ నాయకులు ఈ యాత్రకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  తెలంగాణలోకి యాత్ర ప్రవేశించిన తర్వాత  మధ్యాహ్నం వరకు యాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్తారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారిలో పాదయాత్రను ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ లో పాదయాత్రను ముగించనున్నారు. సుమారు 3,500కి.మీ.పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో పాదయాత్ర ముగించుకొని ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. కర్ణాటక నుండి తెలంగాణలోకి యాత్ర ప్రవేశించనుంది. తెలంగాణనుండి మహారాష్ట్రలోకి యాత్ర  వెళ్లనుంది. వచ్చేఏడాదిలో తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.  రాహుల్ గాంధీ పాదయాత్ర తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని ఈరెండు రాష్ట్రాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. 

click me!