Begum Bazar Honor Killing : కళ్లముందే తిరుగుతూ.. రెచ్చగొడుతూ మాట్లాడుతున్నాడనే.. హత్య...

Published : May 23, 2022, 11:19 AM IST
Begum Bazar Honor Killing : కళ్లముందే తిరుగుతూ.. రెచ్చగొడుతూ మాట్లాడుతున్నాడనే.. హత్య...

సారాంశం

బేగం బజార్ పరువు హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ చెల్లెలిని పెళ్లి చేసుకున్న నీరజ్ తమను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండడాన్ని తట్టుకోలేకే.. హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. 

హైదరాబాద్ : Begum Bazar Honour Killingలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే బేగం బజార్ లో murder జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. తమ చెల్లెలిని ఎత్తుకెళ్లి marriage చేసుకొని, బిడ్డను కని,  ఏడాదిన్నర తర్వాత వచ్చి తమ కళ్లెదుటే తిరుగుతుండడాన్ని సంజన పెదనాన్న కుమారులు జీర్ణించుకోలేకపోయారు. చుట్టుపక్కల వారు,  స్నేహితులతో నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడం… అది సంజన సోదరులకు తెలియడంతో పగతో రగిలిపోయారు.ఈ నేపథ్యంలో నీరజ్ ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల హైదరాబాద్లోని బేగం బజార్ లో నడిరోడ్డుపై హత్యకు గురైన నీరజ్ పన్వార్ కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎలాగైనా అంతం చేయాలని..
తమ చెల్లెలిని ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్,  కళ్లెదుటే ఆమెతో  బండిమీద తిరగడాన్ని నిందితులు జీర్ణించుకోలేకపోయారు. ‘మీ అమ్మాయిని ఎత్తుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నా.. ఏడాదిలోపే  కొడుకును కన్నా… మీ యాదవ సమాజం ఏం చేసింది?’ అని యాదవ్  అహీర్ సమాజ్ కు చెందిన కొందరితో  నీరజ్ అనేవాడని తెలిసింది.  మరోవైపు, యాదవ్ అహీర్ సమాజంలో జరిగే కార్యక్రమాలకు నిందితులను పిలవకపోవడం, చిన్నచూపు చూడటం, బంధువులు సైతం శుభ కార్యాలు, పెళ్లిళ్లకు  పిలవకపోవడం నిందితులు అవమానంగా భావించారు.

నీరజ్ ను చంపితే తమ పగ చల్లారుతుందని హత్యకు ప్లాన్ చేశారు. గురువారం జుమ్మేరాత్ బజార్ లో కత్తులు, రాడ్లు  కొన్నారు. గురువారం,  నీరజ్ కోసం ఓ బాలుడితో రెక్కీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి నీరజ్ తన తాత వెంట బైక్ పై వ్యాపారానికి సంబంధించిన డబ్బులను తీసుకుని వెళ్లేందుకు డ్రమ్ వాలీ గల్లీ వద్ద ఉన్నాడని బాలుడు నిందితులకు ఫోన్ చేశాడు. అంతకుముందే ఆరుగురు నిందితులు పీకలదాకా మద్యం తాగారు. రెండు వాహనాలపై ఐదుగురు వచ్చారు. మరొకరు నడుచుకుంటూ వచ్చారు. వెంటనే నీరజ్ కళ్లల్లో కారం చల్లి.. కత్తులు, రాడ్లతో  దారుణంగా హత్య చేశారు.

సంజనకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం..
2021 ఏప్రిల్ 13న జరిగిన సంజన-నీరజ్ ల పెళ్ళికి మూడు నెలల ముందే, సంజనకు యాదవ్ అహీర్ సమాజ్ కు చెందిన ఓ అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. తర్వాత సంజన, నీరజ్ లు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించినట్లు తెలిసింది. అయితే కూతురికి బిడ్డ పుట్టిన విషయం తెలిశాక.. తల్లి సంజనతో తరచు ఫోన్ లో మాట్లాడేది అని.. ఇక్కడికి రావద్దని హెచ్చరించిందని తెలిసింది. సంజన పెదనాన్న కుమారులు నీరజ్ ను చంపేసి, ఆమె జీవితాన్ని నాశనం చేశారని సంజన తల్లి ఆవేదన చెందుతూ ఉందని తెలిసింది. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu