Huzurabad bypoll: గెల్లు శ్రీనివాస్‌కు మద్ధతు.. ఆర్ కృష్ణయ్యకి బెదిరింపులు, వెయ్యికి పైగా ఫోన్‌ కాల్స్

By Siva KodatiFirst Published Nov 6, 2021, 6:36 PM IST
Highlights

బీసీ సంక్షేమ సంఘం (national bc welfare association) జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు (r krishnaiah) గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టి బెదిరిస్తున్నారని ఆర్ కృష్ణయ్య ఆవేదన  వ్యక్తం చేశారు

బీసీ సంక్షేమ సంఘం (national bc welfare association) జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు (r krishnaiah) గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టి బెదిరిస్తున్నారని ఆర్ కృష్ణయ్య ఆవేదన  వ్యక్తం చేశారు. బహిరంగంగా ఫోన్ నెంబర్లు పెట్టడంతో ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, రెండు రోజులుగా వెయ్యికి పైగా ఫోన్‌లు చేశారని ఆయన చెప్పుకొచ్చారు . హుజురాబాద్‌లో (huzurabad bypoll) గెల్లు శ్రీనివాస్‌కు (gellu srinivas yadav) మద్దతు ఇచ్చానన్న అక్కసుతోనే కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. దీని వెనుక ఎవరున్నారో కనుక్కోవాలని డీజీపీ, హోంమంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బీసీ బంధు కోసం తాను ఎన్నో ధర్నాలు చేశానని, కొన్ని శక్తులు మాత్రం తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. నలభై ఏళ్లుగా బీసీల కోసం పోరాటం చేశానని, హాస్టల్స్, స్కూల్స్ కోసం అనేక ఉద్యమాలు చేసినట్లు ఆయన గుర్తుచేశారు.

కాగా.. హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad byPoll) బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ (etela rajender) విజయం సాధించారు. తద్వారా వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడింటిలో నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించగా.. మూడు సార్లు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు, తెలంగాణ అసెంబ్లీకి మూడుసార్లు ఈటల గెలిచారు.  

ALso Read:Dalit Bandhu: హుజురాబాద్ ఎఫెక్ట్.. దళిత బంధుపై నీలినీడలు.. కేసీఆర్ ఊగిసలాట

తొలుత కమలాపూర్‌ (kamalapur) నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించగా.. ఆ తర్వాత ఐదు సార్లు హుజురాబాద్ నుంచే విజయ బావుట ఎగురవేశారు. ప్రస్తుత ఉపఎన్నికకు ముందు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రతి ఎన్నికలోనూ భారీగా మెజారిటీ సాధించారు. చివరి మూడు ఎన్నికల్లో ఆయన మెజారిటీ 40 వేలకు వుంది. 2004లో అత్యత్పలంగా 19 వేల మెజారిటీతో గెలుపొందిన ఈటల..  2010 ఎన్నికల్లో అత్యధికంగా 79 వేల మెజారిటీ సాధించారు. తాజాగా జరిగిన ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు 1,06,780 ఓట్లు పోలవ్వగా... టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,712 ఓట్లు పడ్డాయి. తద్వారా దాదాపు 24 వేల పైచీలుకు ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలుపొందారు. 
 

click me!