బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య... క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత..

Published : Aug 23, 2022, 03:33 PM ISTUpdated : Aug 23, 2022, 04:48 PM IST
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య... క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. 

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సురేష్‌గా గుర్తించారు. సురేష్ బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుని వివరాలు సేకరించారు. సురేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

సురేష్ ఆత్మహత్యతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసిన అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం జరగడం వల్లే సురేష్ ప్రాణాలు కోల్పోయాడని కొందరు విద్యార్థులు ఆరోపించారు. క్యాంపస్‌లోని పలు విద్యార్థులు ధ్వంసం చేశారు. ఇక, సురేష్ మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే