పీఎఫ్‌ఐకి టీఆర్ఎస్ నిధులు ఇస్తోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Published : Sep 21, 2022, 01:56 PM IST
పీఎఫ్‌ఐకి టీఆర్ఎస్ నిధులు ఇస్తోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్‌ఐకి టీఆర్ఎస్ నిధులు ఇస్తోందని ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్‌ఐకి టీఆర్ఎస్ నిధులు ఇస్తోందని ఆరోపించారు. పీఎఫ్‌ఐతో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. 2040 నాటికి భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్‌ఐ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పీఎఫ్‌ఐ అడ్డగా మారిందని అన్నారు. ఇక, ప్రస్తుతం బండి సంజయ్ నాలుగో విడుత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్ర నేడు తొమ్మిదో రోజుకు చేరింది. 

ఈ రోజు ఉదయం నాగోల్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం నాగోల్‌ నుంచి బండి సంజయ్ పాదయాత్ర మొదలైంది. నాగోల్ నుంచి కొత్తపేట కన్యకా పరమేశ్వరీ టెంపుల్, బాబా కాంప్లెక్స్, చైతన్యపురి, పీ అండ్ టీ కాలనీ, సరూర్‌నగర్ గాంధీ విగ్రహం, కర్మాన్‌ఘాట్ క్రాస్ రోడ్స్, బైరామల్ గూడా క్రాస్ రోడ్స్, వెంకటరమణ కాలనీ, టీవీ కాలనీ బస్సు స్టాప్, ఎన్జీవోస్ కాలనీ వాటర్ ట్యాంక్, వనస్థలిపురం షాపింగ్ కాంప్లెక్స్, హుడా సాయి నగర్ మీదుగా ఆటోనగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Medaram Travel Guide : సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళుతున్నారా..? ఈ టూరిస్ట్ స్పాట్స్ కూడా చుట్టిరండి
Harish Rao: హ‌రీశ్‌రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారా.? ఏడున్న‌ర గంట‌ల విచార‌ణ‌లో ఏం తేలిందంటే