గవర్నర్‌తో గౌరవెల్లి భూ నిర్వాసితుల భేటీ: నిర్వాసితులకు బీజేపీ అండ

Published : Jun 15, 2022, 12:00 PM ISTUpdated : Jun 15, 2022, 12:07 PM IST
గవర్నర్‌తో గౌరవెల్లి భూ నిర్వాసితుల భేటీ: నిర్వాసితులకు బీజేపీ అండ

సారాంశం

గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి బీజేపీ నేతలు బుధవారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు.భూ నిర్వాసితులతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నాడు రాత్రి భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం గవర్నర్ తో నిర్వాసితులతో సంజయ్ సమావేశమయ్యారు. 

హైదరాబాద్: Gouravelliభూ నిర్వాసితులతో కలిసి BJP  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay నేతృత్వంలోని బృందం బుధవారం నాడు Rajbhavan లో గవర్నర్  Tamilisai soundararajan తో భేటీ అయ్యారు.

గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం కారణంగా Gudatipally వాసులు నిర్వాసితులుగా మారనున్నారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండానే సర్వే నిర్వహించడాన్ని గుడాటిపల్లి వాసులు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 14న కరూడా  గుడాటిపల్లి వాసులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురౌతున్న గుడాటిపల్లి వాసులు సర్వే పనులను అడ్డుకున్నారు.తమకు పరిహారం చెల్లించిన తర్వాతే  సర్వే చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆదివారం నాడు రాత్రి గుడాటిపల్లి వాసులపై పోలీసులు లాఠీచార్జీకి దిగారు. అకారణంగా తమపై లాఠీచార్జీ సర్వే పనులు చేశారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సోమ, మంగళవారాల్లో గ్రామస్తులు ఆందోళనలు నిర్వహించారు. మంగళవారం నాడు హుస్నాబాద్ వద్ద గుడాటిపల్లి వాసులు ఆందోళన చేశారు.  ఎమ్మెల్యే సీష్ క్యాంప్ కార్యాలయాన్ని  Gudatipally నిర్వాసితులు ముట్టడించే ప్రయత్నం చేశారు. భూ నిర్వాసితులకు పోటీగా TRS ఆందోళనకు దిగింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది.

గౌరవెళ్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన గుడాటిపల్లి వాసులపై పోలీసులు లాఠీచార్జీకి కి నిరసనగా మంగళవారం నాడు కూడా ఆందోళనలు కొనసాగాయి. ఎమ్మెల్యే సతీష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు  ఆందోళనకారులు ప్రయత్నించారు.  భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున హుస్నాబాద్ కు తరలి వచ్చారు. ఆందోళన కారులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హుస్నాబాద్ బస్టాండ్, మల్లెచెట్టు చౌరస్తా వద్ద ఆందోళనలు నిర్వహించారు. హన్మకొండ-హుస్నాబాద్ ప్రధాన రహాదారిపై వంటా వార్పు చేస్తూ ఆందోళనకారులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు ఆందోళనకారులకు వ్యతిరేకంగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారుల దాడిలో ఏసీపీకి స్వల్ప గాయాలయ్యాయి.  పోలీసుల లాఠీచార్జీ  చేయడంతో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. తమపై ఆందోళనకారులు దాడి చేశారని టీఆర్ఎస్ కు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. 

also read:హుస్నాబాద్‌లో ఉద్రిక్తత: ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి గుడాటిపల్లి వాసులయత్నం, పోలీసుల లాఠీచార్జీ

మంగళవారం నాడు భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో ఓ మహిళ స్పృహ తప్పి పడింది. మరో వైపు ఆందోళనకారుల దాడిలో ఏసీపీకి కూడా గాయాలయ్యాయి.  ఈ విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధితులను పరామర్శించారు. ఇవాళ బాధితులతో కలిసి గవర్నర్ ను కలిశారు.

ఇవాళ హెచ్ఆర్‌సీలో బీజేపీ నేతలు ఈ విషయమై ఫిర్యాదు చేయనున్నారు. మరో వైపు లాఠీచార్జీలో గాయపడిన వారిని బీజేపీ డాక్టర్స్ బృందం చికిత్స అందించనుంది. అంతేకాదు బీజేపీ లీగల్ సెల్ బృందం బాధితులకు న్యాయ సహాయం కూడా అందించనుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?