బీజేపీపై బండి సంజయ్ కుమార్ అసంతృప్తి వ్యక్తపరిచారు. తనను బలవంతంగా కరీంనగర్ స్థానం నుంచి బరిలోకి దించినట్టు మిత్రుల వద్ద ఆవేదన చెందారు. రెండు సార్లు ఓడిపోయిన ఇదే స్థానం నుంచి పోటీకి దింపి ఇమేజ్ దెబ్బతీ
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ దూసుకెళ్లుతున్న సమయంలో అధిష్టానం అప్పటి పార్టీ సారథి బండి సంజయ్ కుమార్‌ను పక్కనపెట్టింది. ఆయనను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు పార్టీ క్యాడర్ నుంచీ కూడా అసంతృప్తి వచ్చింది. బీజేపీ అధిష్టానం కావాలనే బండి సంజయ్ కుమార్‌ను సైడ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కానీ, బండి సంజయ్ మాత్రం పార్టీ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తపరచలేదు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదోన్నతి పొందిందని సంతృప్తి చెందినట్టు వ్యవహరించారు. ఆ తర్వాత కూడా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా, ఆయన పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలిసింది.
బీజేపీ తొలి జాబితాలో బండి సంజయ్ కుమార్‌ను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిపింది. ఈ నిర్ణయంపై ఆయన తన సన్నిహితుల ముందు బాధపడినట్టు సమాచారం. తన ఇమేజ్‌ను దెబ్బతీయడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని వాపోయినట్టు తెలిసింది.
బీజేపీ రాష్ట్ర నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అనాసక్తి చూపిస్తున్నారు. బండి సంజయ్ కుమార్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విముకత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒక వేళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తనను నిలపాలని భావిస్తే.. పార్టీ బలం ఉన్న ముధోల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమనీ సంకేతాలు ఇచ్చారు. కానీ, రెండు సార్లు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్లీ అక్కడే బరిలో నిలిపిందని బండి పేర్కొన్నారు. తాను గెలిచే అవకాశాలు పెద్దగా లేకున్నా కరీంనగర్‌లో దింపిందని, ఇది కేవలం తన ప్రతిష్టను దెబ్బతీయడానికేనని బండి సంజయ్ తన మిత్రుల వద్ద బాధపడినట్టు సమాచారం.
Also Read: పార్టీ మార్పు పై బీజేపీ నేత డీకే అరుణ స్పష్టత.. ఆమె ఏమన్నారంటే?
తనను అధ్యక్ష పదవి నుంచి తొలగించినాక కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి తనకు గౌరవం ఇవ్వడం లేదని, తన కంటే ఈటల రాజేందర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్రుగా ఉన్నారు. హుస్నాబాద్ నుంచి పోటీకి బొమ్మ శ్రీరాం చక్రవర్తిని బండి సూచించారు. కానీ, ఈ ప్రతిపా దనను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. వేములవాడ, మంథని, పెద్దపల్లితోపాటు కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఇతర స్థానాల అభ్యర్థులనూ తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నట్టు బండి సంజయ్ ఆవేదన చెందినట్టు తెలిసింది. ఒక వేళ బీజేపీ తనను రాజకీయంగా ఉపయోగిం చుకోకపోతే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గానే ఫుల్ టైమ్ చేస్తాననే అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తపరిచినట్టు సమాచారం.