సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు డిమాండ్: మల్దకల్‌లో దీక్ష చేసిన బండి సంజయ్

Published : Apr 20, 2022, 10:51 AM ISTUpdated : Apr 20, 2022, 10:54 AM IST
 సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు డిమాండ్: మల్దకల్‌లో దీక్ష చేసిన బండి సంజయ్

సారాంశం

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు  సాగుతున్నాయి. ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ నిరసన చేపట్టారు.

గద్వాల: ఖమ్మం జిల్లాలో BJP కార్యకర్త Sai Ganesh  ఆత్మహత్యకు నిరసనగా బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా  బీజేపీ నిరసనలు చేపట్టింది.  Praja Sangrama Yatra నిర్వహిస్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నిరసన దీక్షలో పాల్గొన్నారు.

Jogulamba Gadwal District జిల్లాలోని  మల్ధకల్ లో ప్రజా సంగ్రామ యాత్ర  శిబిరం వద్ద Bandi Sanjay, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు DK Aruna సహా పలువురు ఆ పార్టీ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలనలో అరాచకాలు ఎలా ఉండేవో అదే తరహలో అరాచకాలు TRS  పాలనలో ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా టీఆర్ఎస్ నేతల పేర్లే బయటకు వస్తున్నాయన్నారు. హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాల కేసుల్లో టీఆర్ఎస్ నేతల ప్రమేయం  ఉందని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కూడా బండి సంజయ్ చెప్పారు.

సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ విషయమై సీబీఐ విచారణ జరిపించి తమ తప్పును రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలని కోరారు. తప్పు చేస్తున్న టీఆర్ఎస్ నేతలను వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. గణేష్ మరణానికి కారణమైన వారికి శిక్ష పడేవరకు పోరాటం చేస్తామన్నారు.

Khammam జిల్లా కేంద్రంలో తమ పార్టీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు టీఆర్ఎస్ నేతలే కారణమన్నారు. మంత్రి Puvvada Ajay kumar వేధింపులకు పాల్పడ్డారన్నారు. సాయి గణేష్ పై 16 కేసులు నమోదు చేయించారన్నారు. అంతేకాదు సాయి గణేష్ పై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు.ఈ విషయమై సాయి గణేష్ ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగాడన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ మరణించాడని బండి సంజయ్ చెప్పారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో  సాయి గణేష్  మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టుగా మీడియాకు చెప్పారు. కానీ సాయి గణేష్ నుండి పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదన్నారు.  

అక్రమ కేసులను నిరసిస్తూ సాయి గణేష్ ఈ నెల 14న ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ముందే  పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న  గణేష్ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య విసయమై బీజేపీ ఆందోళనలు చేసింది. దీంతో ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం నాడు ఫోన్ చేసి మాట్లాడారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?