బండి సంజయ్ యాత్రకు బ్రేక్: ప్రజా సంగ్రామ యాత్రకు రెండు రోజుల విరామం

Published : Apr 25, 2022, 04:03 PM ISTUpdated : Apr 25, 2022, 10:08 PM IST
బండి సంజయ్ యాత్రకు బ్రేక్: ప్రజా సంగ్రామ యాత్రకు రెండు రోజుల విరామం

సారాంశం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రకు బ్రేక్ పడింది. అస్వస్థతకు గురైన బండి సంజయ్ యాత్రకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు. BJP Bandi Sanjay Padayatra


హైదరాబాద్: BJP  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay   పాదయాత్రకు బ్రేక్ పడింది. రెండు రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్రకు బండి సంజయ్ విరామం ఇవ్వనున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ వడ దెబ్బకు గురయ్యారు. దీంతో రెండు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.  

ఈ నెల 14వ తేదీన జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. గద్వాల జోగులాంబ జిల్లాలో ప్రస్తుతం బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది.ఈ నెల 23వ తేదీకి బండి సంజయ్ 100 కి.మీ పాదయాత్ర పూర్తి చేశారు.

ఆదివారం నాడు బండి సంజయ్ పాదయాత్ర నర్వ-పాతర్ చేడు గ్రామాల మధ్యకు చేరుకొనే సమయానికి వడదెబ్బకు గురయ్యాడు. దీంతో బండి సంజయ్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శరత్ ఆయనకు పరీక్షలు నిర్వహించాడు. వడదెబ్బకు గురైన బండి సంజయ్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. అయితే పాదయాత్రను కొనసాగించాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకొన్నాడు

2021 ఆగష్టు 28వ తేదీన బండి సంజయ్ తన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను హైద్రాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రారంభించారు.  తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో ముగించారు.   పాదయాత్ర ముగించిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.  రెండో విడత పాదయాత్ర పూర్తైన తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మరో విడత యాత్రను  బండి సంజయ్ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు బండి సంజయ్.  

2023 లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పాదయాత్ర పినికి వస్తుందని కూడా పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేలను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు కమలదళం నేతలు

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్