ప్రధాన మంత్రి ఈ నెల 19న తెలంగాణ టూర్ కు రానున్నారు. సికింద్రాబద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మోడీ ప్రారంభభిస్తారు. అంతేకాదు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
హైదరాబాద్:ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఆ పార్టీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు సోమవారంనాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మోటీ టూర్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్ లు సమావేశమయ్యారు. . ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వందే భారత్ రైలు ప్రారంభంతోపాటు ఆరోజు ప్రధాని ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు.
undefined
ఈనెల 19న మొత్తం రూ.2400 కోట్ల వ్యయంతో రైల్వేకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తున్నారని అధికారులు బండి సంజయ్, లక్ష్మణ్ లకు వివరించారు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను, చేపట్టాల్సిన ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బండి సంజయ్, లక్ష్మణ్ రైల్వే అధికారులకు సూచించారు.. అనంతరం బండి సంజయ్ తో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద పీట వేస్తున్నారన్నారు.. ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. . జాతీయ రహదారుల విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానానికి చేరుకుందన్నారు..
రైల్వే లైన్, డబ్లింగ్, ఎంఎంటీఎస్, గేజ్ మార్పిడి పనులను కేంద్రం పెద్ద ఎత్తున చేపట్టిందన్నారు. సికింద్రాబాద్-విశాఖపట్నం వరకు ‘వందేభారత్’ రైలును జెండా ఊపి ప్రధాని ప్రారంభిస్తారని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఈ రైలు ద్వారా ప్రయాణీకులకు మూడున్నర గంటట సమయం ఆదా కానుందన్నారు.. రూ.2400 కోట్లతో వివిధ రైల్వే అభివృద్ది పనులను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించబోతున్నారని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రూ.700 కోట్లతో ఆధునీకరణ పనులకుప్రధాని శంకుస్థాపన చేస్తారని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. అలాగే కాజీపేట ఓరాలింగ్ వర్క్ షాప్ పనులను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని ఎంపీ వివరించారు. రూ.1231 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభిస్తారన్నారు.
తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ చేసిన విమర్శలపై లక్స్మణ్ స్పందించారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నా తెలంగాణ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. అనంతరం బండి సంజయ్, లక్ష్మణ్ లు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.