Banakacherla Project : చంద్రబాబుకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Published : Jun 18, 2025, 09:59 PM ISTUpdated : Jun 18, 2025, 10:08 PM IST
Revanth Reddy

సారాంశం

ఏపీ సర్కార్ చేపడుతున్న గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెెలంగాణకు చెందిన అన్నిపార్టీల ఎంపీలు సమావేశమయ్యారు. ఇందులో చంద్రబాబుపై రేవంత్ గరం అయ్యారు. ఏమన్నారంటే…

Revanth Reddy : తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం రాజుకుంది. ఇప్పటికే నదీజలాల పంపకాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదం సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు సర్కార్ గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ మరోసారి అగ్గి రాజేసింది. ఈ ప్రాజెక్ట్ ను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే... ఏపీ ప్రభుత్వం మాత్రం సముద్రంలో కలిసే మిగులు జలాలనే వాడుకునేలా దీన్ని ప్లాన్ చేసామని చెబుతోంది. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ ఏపీ, తెలంగాణ మధ్య జలజగడానికి తెరలేపింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వ బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చించేందుకు అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించింది. ఇందులో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులు ఈ ప్రాజెక్ట్ గురించి తెలంగాణ ఎంపీలకు వివరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అందుకే అధికార పార్టీతో సహా ప్రతిపక్ష ఎంపీలను కలుపుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్దం అవుతున్నామన్నారు. పార్టీల మధ్య రాజకీయ విబేధాలున్నా ఇప్పుడు పక్కనబెట్టాలని... తెలంగాణ రైతుల కోసం కలికట్టుగా పోరాడి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుందామని రేవంత్ సూచించారు.

చంద్రబాబుకు రేవంత్ సూచన 

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేసారు. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నారు... కాబట్టి ఆయన చెబితే ప్రధాని మోదీ వినవచ్చని అన్నారు. కానీ తమ ప్రయోజనాలను తాకట్టుపెడుతూ నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమని... ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర హక్కులను వదులుకోబోమని అన్నారు. ఒకవేళ కేంద్రం తెలంగాణ హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రేవంత్ స్పష్టం చేసారు.

మిగులు జలాలు 3 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయంటున్నారుగా... మరి మా వాటా వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణ సీఎం కోరారు. గోదావరిలో తెలంగాణ హక్కుగా ఉన్న 968 టీఎంసీలు వినియోగానికి అనుమతించాలన్నారు. ఇలా తమ వాటా వాడుకున్నాక మీరు ఏ ప్రాజెక్టుకైనా నీటిని తరలించండి... అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

 

 

బనకచర్ల కేసీఆర్ చేసిన ద్రోహమే :

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన గతంలో పదేపదే ఏటా 3 వేల టిఎంసిల నీరు వృధాగా పోతున్నాయని మాట్లాడారని... ఈ నీటినే ఇప్పుడు వాడుకుంటున్నామని ఏపీ అంటోందన్నారు. కేసీఆర్‌ చేసిన ద్రోహం వల్లే ఏపీ నీటిని తరలించుకు పోయేందుకు సిద్దమయ్యిందన్నారు.

గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిగా కడితే వరద ఎంత వస్తుందో తెలిసేది... కానీ కేసీఆర్ సర్కార్ అలా చేయలేదన్నారు. ఇప్పుడు మోడీకి చంద్రబాబు.. చంద్రబాబుకు మోడీ అవసరం ఉంది... కాబట్టి అధికారం మీకు, నీళ్లు మాకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

అఖిలపక్షం నుండి బిఆర్ఎస్ వాకౌట్ :

బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం చేపట్టిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో బిఆర్ఎస్ కూడా పాల్గొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ గురించి కాకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ ఈ సమావేశం నుంచి బీఆర్ఎస్‌ వాకౌట్‌ చేసింంది. సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన బీఆర్ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

ఇలా బిఆర్ఎస్ ఎంపీ వెళ్ళిపోవడంపై సీఎం రేవంత్ రియాక్ట్ అయ్యారు. ఆయనకు ఉండే ఇబ్బంది ఆయనకు ఉంటుంది.. పోనివ్వండి... వాస్తవాలు బయటకు రావడంతో ఇబ్బంది పడినట్టున్నారు అంటూ రేవంత్‌రెడ్డి చురకలు అంటించారు.

అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నది వీరే..

బనకచర్ల ప్రాజెక్టుపై సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల భేటీ జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రఘురాం రెడ్డి..

బీజేపీ నుంచి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు... ఎంఐఎం నుంచి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !