నాపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారు : బాల్క సుమన్

By Arun Kumar PFirst Published Sep 12, 2018, 3:03 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే 105 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అయితే రెండు చోట్ల మాత్రం సిట్టింగ్ లను కాదని వేరే అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయమే ఇపుడు పార్టీతో పాటు అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. 

ముఖ్యంగా చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ కేటాయించకపోవడంతో అతడితో పాటు అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మనస్థాపంతో ఓదేలు మద్దతుదారుడొకరు బాల్క సుమన్ ప్రచార కార్యక్రమంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన ఇవాళ ఇందూరు గ్రామంలో చోటుచేసుకుంది.

బుధవారం టీఆర్ఎస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి, ఎంపి బాల్క సుమన్ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ఆదిలోనే అతడికి నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఓదేలు మద్దతుతుదారుడొకరు సుమన్ ప్రచార కార్యక్రమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడితో పాటు మరికొందరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ఈ ఘటనపై సుమన్ స్పందించాడు. ఓదేలు మద్దతుదారులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారని సుమన్ ఆరోపించారు.  తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారనీ...అయితే గన్ మెన్లు, తన మద్దతుదారులు వారిని అడ్డుకుని తనకు రక్షణగా నిలిచారని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని, కేసీఆర్ ఆదేశాల ప్రకారం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే పోటీ చేస్తానని సుమన్ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

బాల్కసుమన్ కు షాక్: ఒంటికి నిప్పంటించుకొన్న ఓదేలు అనుచరుడు

click me!