అసెంబ్లీ బరిలో బాల్క సుమన్

First Published 6, Sep 2018, 4:17 PM IST
Highlights

 పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్న బాల్క సుమన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వివేక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు. అయితే ఎన్నికల అనంతరం వివేక్ తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరడంతో బాల్క సుమన్ ను అసెంబ్లీకి పంపించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారు. 

హైదరాబాద్: పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్న బాల్క సుమన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వివేక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు. అయితే ఎన్నికల అనంతరం వివేక్ తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరడంతో బాల్క సుమన్ ను అసెంబ్లీకి పంపించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారు. 

 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న సందర్భంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బాల్క సుమన్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. చెన్నూరు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వివేక్ కు లైన్ క్లియర్ అయ్యింది. వివేక్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. 

మరోవైపు నిజామాబాద్ ఎంపీ కవిత సైతం అసెంబ్లీకి మారతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ప్రకటించడంతో కవిత అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యరని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ నుంచే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని సమాచారం. 

Last Updated 9, Sep 2018, 1:30 PM IST