టీఆర్ఎస్ లోకి ఎల్. రమణ జంప్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

By Arun Kumar PFirst Published Jul 19, 2021, 10:42 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా సీనియర్ నాయకులు బక్కని నర్సింహులును నియమిస్తూ టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.   

హైదరాబాద్: ఎల్. రమణ టీఆర్ఎస్ చేరికతో ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని భర్తీ చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. టిటిడిపి అధ్యక్షుడిగా సీనియర్ నాయకుల బక్కని నర్సింహులును నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు పేరిట అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఎల్ రమణ స్థానంలో ఆయనను అధ్యక్షుడిగా నియమిస్తూ టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారి చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  నియోజకవర్గానికి చెందిన నర్సింహులు టిడిపి ఎమ్మెల్యే,  టిటిడి బోర్డు  సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి వుంది. అంతేకాకుండా నర్సింహులు చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడు. అందువల్లే అతడికి టిటిడిపి పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. 

తెలంగాణ పార్టీ అద్యక్షుడిగా నియమితులైన బక్కని నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని లోకేష్ ఆయనకు సూచించారు. 

read more  చేనేత వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత: ఎల్. రమణను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్

ఇక ఇప్పటికు తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాజీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకుని సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.   
 
టీఆర్ఎస్ లో చేరడానికే టిటిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానంటూ తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడికి పంపించారు రమణ. రమణ పార్టీని వీడటంతో తెలంగాణ టిడిపి నాయకులో చర్చించిన చంద్రబాబు నర్సింహులుకు రాష్ట్రంలో పార్టీ పగ్గాలు అప్పగించారు. 

 

click me!