తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీవరకు నిర్వహించనున్నారు. సోమవారం నాడు బీఎసీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకొన్నారు.
హైదరాబాద్: ఈ నెల 22వ తేదీవరకు అసెంబ్లీ నిర్వహించాలని సోమవారం నాడు నిర్వహించిన బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే బీఎసీ సమావేశమైంది.
ఈ నెల 14వరకు అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. 14, 15 తేదీల్లో కూడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చిస్తారు.ఆ తర్వాత ఈ నెల 16 నుండి 21వ తేదీవరకు పద్దులపై చర్చించాలని నిర్ణయం తీసుకొన్నారు.
మొహర్రం, వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీవరకు అసెంబ్లీకి సెలవులు ఇచ్చారు. ఈ నెల 22వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.దీంతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడనున్నాయి.
ఇదిలా ఉంటే శాసనమండలి బీఎసీ సమావేశం కూడ మండలి వాయిదా పడిన తర్వాత సోమవారం నాడు జరిగింది. ఈ నెల 22వరకు సమావేశాలు నిర్వహించాలని శాసనమండలి బీఎసీ సమావేశం నిర్ణయం తీసుకొంది.
ఈ నెల 10వ తేదీన శాసనమండలికి సెలవు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన శాసనమండలి ఛైర్మెన్ ఎన్నికను నిర్వహిస్తారు. ఈ నెల 12, 13 తేదీల్లో శాసనమండలికి సెలవులు ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన బడ్జెట్‌పై శాసనమండలిలో చర్చిస్తారు. ఈ నెల 15వ తేదీన బడ్జెట్‌పై విపక్షాలకు సీఎం సమాధానం చెబుతారు.