ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. శివాజీనగర్‌లో ఏడాది చిన్నారిని తల్లిదండ్రులు చెట్టుకింద వదిలేసి వెళ్లారు. ఆహారం లేక చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చిన్నారి చెట్టు కింద పడి ఉండటం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు విశాఖలో ఇటువంటి ఘటనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ధన్‌బాద్ నుంచి అలెప్పి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో అప్పుడే పుట్టిన శిశువును వదిలేసిన ఘటన కలకలం రేపింది. రైలు బుధవారం ఉదయం సింహాచలం స్టేషన్ నుంచి విశాఖకు వెళ్తుండగా 8.20 గంటల సమయంలో టాయ్‌లెట్ నుంచి శిశువు ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. దాంతో ప్రయాణికులు అప్రమత్తమై శిశువును గుర్తించి టీటీఈకి సమాచారం అందించారు. దీనిపై ఆయన విశాఖ రైల్వే పోలీసులకు నివేదించారు. రైలు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయానికి ఆర్పీఎఫ్ పోలీసులు, వైద్య సిబ్బందితో సిద్ధంగా ఉండి, ప్రాధమిక పరీక్షల అనంతరం శిశువును రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఆపై మరింత మెరుగైన చికిత్స, సంరక్షణ నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వాల్తేర్ డీఆర్ఎం అనూప్ సత్పతి వేగంగా స్పందించిన టీటీఈకి రివార్డు ప్రకటించారు. అలాగే ఈ చిన్నారి బాధ్యత తీసుకునేందుకు డీఆర్ఎం ముందుకొచ్చారు. శిశువు తల్లిదండ్రులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఒకవేళ చిన్నారి పోషణకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నట్లయితే వారికి సాయం చేస్తామని డీఆర్ఎం వెల్లడించారు.
ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. శివాజీనగర్‌లో ఏడాది చిన్నారిని తల్లిదండ్రులు చెట్టుకింద వదిలేసి వెళ్లారు. ఆహారం లేక చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.