నడిరోడ్డుపై గర్భిణీ ప్రసవం.. సూర్యాపేటలో దారుణం

By telugu news team  |  First Published Apr 17, 2020, 9:46 AM IST
వాహన సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆస్పత్రికి వెళ్లే క్రమంలో ఓ చోట రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికెడ్లను పక్కకు తీసేందుకు భర్త ద్విచక్ర వాహనం దిగాడు.

అర్ధరాత్రి సమయంలో ఓ నిండు గర్భిణి నడిరోడ్డుపై ప్రసవించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రామన్నగూడెనికి చెందిన రేష్మ దంపతులు సూర్యాపేట పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో నొప్పులు రావడంతో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనానికి ఫోన్ చేశాడు.

వాహన సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆస్పత్రికి వెళ్లే క్రమంలో ఓ చోట రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికెడ్లను పక్కకు తీసేందుకు భర్త ద్విచక్ర వాహనం దిగాడు. 

ఆ సమయంలో భార్య నొప్పులతో రోడ్డుపై పడుకుని విలవిలలాడింది. దీంతో ఆమె భర్త స్థానికంగా ఉన్న మహిళలను తీసుకురావడానికి వెళ్లి వచ్చేలోపే రేష్మ ఆడ శిశువును ప్రసవించింది. తర్వాత తల్లిబిడ్డలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
click me!