లివర్, పేగులు దెబ్బతినడంతోనే బి. ఫార్మసీ విద్యార్ధిని మృతి: రిపోర్టు

By narsimha lodeFirst Published Feb 25, 2021, 11:16 AM IST
Highlights

హైద్రాబాద్ బి. ఫార్మసీ విద్యార్ధిని మృతదేహానికి గురువారం నాడు పోస్టుమార్టం పూర్తైంది. పేగులు, లివర్ దెబ్బతినడం వల్లే విద్యార్ధిని మరణించినట్టుగా ప్రాథమిక రిపోర్టులో తేలినట్టుగా వైద్యులు తెలిపారు.


హైదరాబాద్:  హైద్రాబాద్ బి. ఫార్మసీ విద్యార్ధిని మృతదేహానికి గురువారం నాడు పోస్టుమార్టం పూర్తైంది. పేగులు, లివర్ దెబ్బతినడం వల్లే విద్యార్ధిని మరణించినట్టుగా ప్రాథమిక రిపోర్టులో తేలినట్టుగా వైద్యులు తెలిపారు.

బి. ఫార్మసీ విద్యార్ధిని మృతిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. తనపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారయత్నానికి ప్రయత్నించారని పోలీసులను బురిడీ కొట్టించింది ఈ విద్యార్ధిని.

స్నేహితుడితో కలిసి  వెళ్లిన విద్యార్ఇని ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకుగాను ఆటోడ్రైవర్లు అత్యాచారయత్నానికి ప్రయత్నించారని పోలీసులను నమ్మించింది. విచారణలో విద్యార్ధిని వ్యవహారం వెలుగు చూడడంతో ఆమెపై పోలీసులు కేసు పెట్టారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు.

అయితే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన విద్యార్ధిని బంధువుల ఇంట్లో ఉంటుంది. వారం రోజులుగా ఆమె సరిగా భోజనం చేయడం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. లివర్,పేగులు దెబ్బతినడం వల్లే విద్యార్ధిని మరణించిందని ప్రాథమిక రిపోర్టులో తేలింది. విద్యార్ధిని మృతిపై పోలీసులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా కేసు నమోదు చేశారు.ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే విద్యార్ధిని మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

click me!