
జనగామ జిల్లా మొండ్రాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు నిండిపోయి పొంగి ప్రవహించింది. ఆ సమయంలో ఆటోతో కలిసి డ్రైవర్ కొట్టుకుపోయాడు. అతనిని వినోద్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, అధికారులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.