వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కారుపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత..

Published : Jul 13, 2022, 05:47 PM IST
వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కారుపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కారుపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కారుపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీఆర్ఎస్‌లోని మరో వర్గమే ఆమె కారుపై దాడి చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అనుచరలే ఈ దాడి చేశారని సునీతా మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకే పార్టీలో ఉండి ఇలాంటివి చేయడం దారుణమన్నారు. ఈ విషయాలను టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలను సహించేది లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి సునీతా మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇక, గతకొంతకాలంగా వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. అయితే తాజా ఘటనతో వికారాబాద్ టీఆర్ఎస్‌లోని విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు