ములుగు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ రేంజ్ ఐజీ చెప్పారు. నలుగురు మావోయిస్టుల్లో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గ్రేహౌండ్స్ జవాన్ మరణించారని చెప్పారు.
వరంగల్: Telangana-chhattisgarh సరిహద్దుల్లో మంగళవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు Maoists మరణించగా, ఒక Jawan కు గాయాలైనట్టుగా పోలీసులు తెలిపారు.ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని Bastar రేంజ్ ఐజీ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు సీనియర్ నేత Sudhakar సహా మరో 40 నుండి 50 మంది మావోయిస్టులు Venkatapuram సమీపంలోని కొండల్లో సమావేశమయ్యారని ఈ నెల 17న తమకు సమాచారం అందిందని ఛత్తీస్ ఘడ్ పోలీసులు ప్రకటించారు.
ఈ సమాచారం ఆధారంగా Bijapur నుండి గ్రేహౌండ్స్, డీఆర్‌జీ, Crpf దళాలు వెంకటాపూరం ప్రాంతానికి బయలుదేరాయని చెప్పారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్న సమయంలో మంగళవారం నాడు (18.01.2022) ఉదయం ఏడు గంటల సమయంలో మావోయిస్టులు, తమకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని ఛత్తీస్ ఘడ్ పోలీసులు వివరించారు. ఈ ఘటన తెలంగాణలోని పేరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుగోల్ గ్రామం, బీజాపూర్ జిల్లాలోని ఎల్మిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమాల్మోడీ గ్రామాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ ప్రకటనలో ఛత్తీస్ ఘడ్ పోలీసులు తెలిపారు.
ఎన్ కౌంటర్ ముగిసిన తర్వాత సంఘటన స్థలంలో పరిశీలిస్తే నలుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఓ Woman మావోయిస్టు కూడా ఉన్నట్టుగా ఆ ప్రకటనలో ఐజీ వివరించారు. ఈ ఘటనలో గాయపడిన గ్రేహౌండ్స్ జవాన్ ను హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టుగా ఆయన తెలిపారు. మరో వైపు ఎన్ కౌంటర్ నుండి తప్పించుకొన్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టుగా పోలీసులు తెలిపారు.
దంతేవాడలో మరో ఎన్ కౌంటర్
ఈ నెల 17వ తేదీన దక్షిణ బస్తర్ జిల్లాలోని దంతెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుమారు 20 నుండి 25 మంది సాయుధ మావోయిస్టులు సంచరిస్తున్నట్టుగా సమాచారం అందిందని ఛత్తీస్‌ఘడ్ పోలీసులు తెలిపారు. ఈ సమాచారం మేరకు భద్రతా దళాలు మంగళవారం నాడు కాటేకళ్యాణ్, ప్రతాప్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిల్లో మావోయస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని ఛత్తీష్‌ఘడ్ పోలీసులు వివరించారు. ఎన్ కౌంటర్ ముగిసిన తర్వాత సంఘటన స్థలంలో ఒక్క మహిళా మావోయిస్టు మృతదేహన్ని స్వాధీనం చేసుకొన్నామని పోలీసులు తెలిపారు. మరణించిన మహిళా మావోయిస్టును మున్నీగా గుర్తించారు. ఎన్ కౌంటర్ నుండి తప్పించుకొన్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.