న్యూజిలాండ్ లో కాల్పుల కలకలం.. కేటీఆర్ కి అసదుద్దీన్ రిక్వెస్ట్

Published : Mar 15, 2019, 04:33 PM ISTUpdated : Mar 15, 2019, 05:38 PM IST
న్యూజిలాండ్ లో కాల్పుల కలకలం.. కేటీఆర్ కి అసదుద్దీన్ రిక్వెస్ట్

సారాంశం

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో మసీదులో శుక్రవారం మారణహోమం జరిగిన సంగతి తెలిసిందే. ఓ దుండగుడు చేసిన దాడిలో దాదాపు 49మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో మసీదులో శుక్రవారం మారణహోమం జరిగిన సంగతి తెలిసిందే. ఓ దుండగుడు చేసిన దాడిలో దాదాపు 49మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ఘటనపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఓ రిక్వెస్ట్ చేశారు.

న్యూజిలాండ్ కాల్పుల్లో బుల్లెట్ గాయాలకు గురై తీవ్రంగా గాయపడిన వారిలో అహ్మద్ జహంగీర్ అనే యువకుడు కూడా ఉన్నాడు. కాగా.. అతని సోదరుడు ఇక్బాల్ జహంగీర్  హైదరాబాద్ లో ఉంటున్నాడు. కాగా.. తన సోదరుడు, కుటుంబసభ్యుల కోసం ఇక్బాల్ న్యూజిలాండ్ వెళ్లాలనుకుంటున్నాడు. సహాయం చేయగలరా అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. కాగా.. ఆ ట్వీట్ కి కేటీఆర్ వెంటనే స్పందించారు. తమ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధుల సహాయం తీసుకుందామంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

కాగా.. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ దాడులు చేయడం గమనార్హం.నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్ నూర్ మసీదులోకి చొరబడి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తొలుత నలుగురు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తర్వాత వారి సంఖ్య 49కి చేరినట్లు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?