కరోనా భయం.. వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేసి...

By telugu news teamFirst Published Mar 18, 2020, 8:07 AM IST
Highlights

నగరంలోని అల్వాల్ ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులు ఇటీవల విదేశాలకు వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి వచ్చారు. వాళ్లు విదేశాల నుంచి వచ్చారు కాబట్టి.. కరోనా సోకి ఉంటుందనే అభిప్రాయం అక్కడివారికి కలిగింది. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు పాకేసింది. భారత్ లోనూ ముగ్గురు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే... ఈ క్రమంలో కొందరు కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించడం గమనార్హం. ఇందుకు తాజాగా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఓ సంఘటనే ఉదాహరణ. కరోనా ఉందేనే భయంతో వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేశారు. ఈ సంఘటన అల్వాల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read ప్రియురాలి పెళ్లి... తట్టుకోలేక ప్రియుడు రైలుకింద పడి...

నగరంలోని అల్వాల్ ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులు ఇటీవల విదేశాలకు వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి వచ్చారు. వాళ్లు విదేశాల నుంచి వచ్చారు కాబట్టి.. కరోనా సోకి ఉంటుందనే అభిప్రాయం అక్కడివారికి కలిగింది. ఈ క్రమంలో.. అపార్ట్ మెంట్ వాసులంతా.. ఆ వృద్ధ దంపతులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

అందుకు సదరు దంపతులు అంగీకరించకపోవడంతో. బలవంతంగా బయటకు గెంటేశారు. దీంతో... ఆ దంపతులు ఎవరి సహాయం అందక.. బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే నిలపడి ఉన్నారు. కాగా... ఆ అపార్ట్ మెంట్స్ లో దాదాపు 50 కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లిందో లేదో తెలియలేదు. 

click me!