ఏపీ, తెలంగాణలకు కేంద్రం పిలుపు: విభజన సమస్యలపై జనవరి 12న సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కీలక భేటీ

Published : Dec 31, 2021, 12:08 PM ISTUpdated : Dec 31, 2021, 01:10 PM IST
ఏపీ, తెలంగాణలకు కేంద్రం పిలుపు: విభజన సమస్యలపై జనవరి 12న సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కీలక భేటీ

సారాంశం

 ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నుండి పిలుపు అందింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించనుంది. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించేందుకు ఈ సమావేశంలో చర్చించనున్నారు.


న్యూఢిల్లీ: Telangana, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం చొరవ చూపింది. జనవరి 12 వ తేదీన రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ అధికారులు సమావేశం కానున్నారు. ఈ మేరకు ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర Home అధికారులు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలను పంపింది. కేంద్ర  హోంశాఖ సెక్రటరీ లలితా టి హెడ్ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.

also read:స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన.. విధివిధానాలకు ఖరారు చేసిన తెలంగాణ సర్కార్..

రాష్ట్ర విభజన  తర్వాత రెండు రాష్ట్రాల మధ్య  పలు సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి.ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర  ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది.  రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలను పరిష్కరించేందుకు గాను  రెండు రోజుల క్రితం  కేంద్రం రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైంది.

 ఆస్తులు, అప్పులతో పాటు పలు అంశాలపై కూడా  రెండు రాష్ట్రాల మధ్య  చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి.  Electricity  బకాయిల సమస్యలపై కూడా రెండు రాష్ట్రాల మధ్య  పెండింగ్ లో ఉన్నాయి.  తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను తమకు ఇప్పించాలని Andhra pradesh ప్రభుత్వం కోరుతుంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది.  మరో వైపు నీటి వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య తారాస్థాయికి చేరుకొన్నాయి.

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు పలు ప్రాజెక్టులపై ఏపీ రాష్ట్రం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌