నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలి: కేఆర్ఎంబీకి ఏపీ లేఖ

Published : Apr 05, 2022, 11:26 AM IST
నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలి: కేఆర్ఎంబీకి ఏపీ లేఖ

సారాంశం

నాగార్జునసాగర్ లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం నీటిని వృధా చేస్తుందని ఏపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. వేసవిలో తాగు నీటి అవసరాలకు కూడా నీరు లేకుండా తెలంగాణ వ్యవహరిస్తుందని ఏపీ అందోళన వ్యక్తం చేస్తుంది.ఈ విషయమై తెలంగాణకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.

హైదరాబాద్:నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం  విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని  ఏపీ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్  నారాయణ రెడ్డి కేఆర్ఎంబీకి మంగళవారం నాడు లేఖ రాశారు.

Nagarjuna Sagar Project లో Telangana  ప్రభుత్వం Electricity ఉత్పత్తి కోసం  నీటిని ఉపయోగిస్తూ దిగువకు విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే Pulicninthala రిజర్వాయర్ కెపాసిటీ లెవల్ లో నీరుందని Andhra Pradesh ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా పులిచింతల  నుండి కూడా నీటిని విడుదల చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది.  ప్రకాశం బ్యారేజీలో కూడా నీరున్న విషయాన్ని ఏపీ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకొచ్చారు.

విద్యుత్ ఉత్పత్తి పేరుతో నాగార్జున సాగర్ లో నీటిని ఉపయోగించడం వల్ల వేసవిలో Drinking Water అవసరాలకు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంటుందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని  నాగార్జునసాగర్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలివివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.

రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల కాలంలో  నీటి వివాదాలు కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో కూడా  ఇరు రాష్ట్రాలు పరస్పరం పిర్యాదులు చేసుకొన్నాయి. ప్రధానంగా కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం  నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అయితే తమ రాష్ట్ర అవసరాల మేరకు తమ నీటి వాటా మేరకే ఈ ప్రాజెక్టు ద్వారా వాడుకొంటామని ేపీ వాదిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే తెలంగాణ రాష్ట్రం ఏడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ వాదిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?