చంద్రబాబు, రేవంత్ భేటీ ... తెలుగు సీఎంల మధ్య చర్చకువచ్చిన అంశాలివే...

By Arun Kumar P  |  First Published Jul 6, 2024, 8:27 PM IST

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న ప‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దిశ‌గా ఇరువురు ముఖ్య‌మంత్రులు చ‌ర్చ‌లు జ‌రిపారు.
 


హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు కొనసాగుతూనే వున్నాయి... వీటిని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. తెలుగు సీఎంల భేటీకి హైదరాబాద్ లోని ప్రజా భవన్ వేదికయ్యింది.  

ఇద్దరు సీఎంలు ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజనపై చర్చించారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటుచేసిన షీలా బిడే కమిటీ చొరవతొ షెడ్యూల్ 9 లోని 68 సంస్థలపై ఇరురాష్ట్రాలు అంశాలు చర్చల్లో కీలకంగా ఉన్నాయి. ఇక మిగిలిన 23 సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇప్పటికీ ఇరురాష్ట్రాల మధ్య వివాదం సాగుతోంది. అలాగే 10 షెడ్యూల్ లోని 30 సంస్థల పంపిణీపై కూడా వివాదం సాగుతోంది. వీటి పరిష్కారానికి చంద్రబాబు, రేవంత్ చర్చలు జరిపారు. 

Latest Videos

undefined

అయితే ఈ భేటీలో పోలవరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో కలిపిన విషయమూ చంద్రబాబు, రేవంత్ మధ్య చర్చకు వచ్చింది. వీటిని తిరిగి తెలంగాణలో కలపేందుకు సహకరించాలని రేవంత్ కోరారు. అలాగే  తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ లో తెలంగాణకు స్థానం కల్పించాలని రేవంత్ కోరారు. 

ఇక స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్, విద్యుత్ బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, లేబర్‌సెస్ పంపిణీ,  ఉమ్మడి సంస్థల ఖర్చు సొమ్మును తిరిగి చెల్లించడం, హైదరాబాద్‌లో 3 భవనాల పంపకాలు నిలుపుదల తదితర అంశాలను ఇద్దరు సీఎంలు చర్చించారు. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, జనార్ధన్‌రెడ్డి, కందుల దుర్గేష్, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాలు పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు. 

click me!