పెళ్లి రోజే డెలీవరీ: మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా ప్రణయ్

Published : Jan 30, 2019, 05:19 PM ISTUpdated : Jan 30, 2019, 05:54 PM IST
పెళ్లి రోజే డెలీవరీ: మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా ప్రణయ్

సారాంశం

అమృత  బుధవారం నాడు  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అమృత, ప్రణయ్‌ పెళ్లి చేసుకొన్న రోజునే  అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది.  


హైదరాబాద్: అమృత  బుధవారం నాడు  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అమృత, ప్రణయ్‌ పెళ్లి చేసుకొన్న రోజునే  అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది.

 గత ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ మిర్యాలగూడలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఈ మేరకు కిరాయి హంతకముఠాతో మారుతీరావు ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా పోలీసులు గతంలోనే ప్రకటించారు.

ప్రణయ్‌, అమృతలు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఒకే స్కూల్‌లో చదువుకొనే ప్రణయ్, అమృతలు  స్కూల్ లోనే ప్రేమలో పడ్డారు. ఇంజనీరింగ్ చేసే సమయంలో అమృత తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి అమృతను మందలించారు.

ప్రణయ్‌ అమృతలు గత ఏడాది ఇదే రోజున హైద్రాబాద్ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి చేసుకొన్న తర్వాత చాలా కాలం మిర్యాలగూడకు దూరంగా ఉన్నారు. అమృత గర్భం దాల్చిన తర్వాత  అమృత, ప్రణయ్‌ దంపతులు  మిర్యాలగూడకు చేరుకొన్నారు.

అమృత , ప్రణయ్‌లు  ఆసుపత్రిలో చెకప్‌కు వెళ్లిన సమయంలో గత ఏడాది సెప్టెంబర్ 14 వ తేదీన కిరాయి హంతకులు .ప్రణయ్‌ను హత్య చేశారు. ప్రణయ్ హత్య జరిగిన సమయానికి అమృత ఐదు మాసాల గర్భిణీ.

ప్రణయ్‌, అమృతలు పెళ్లి చేసుకొన్న రోజునే అమృత పండంటి బిడ్డకు హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మనిచ్చింది.తల్లీ,బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని అమృత కుటుంబ సభ్యులు ప్రకటించారు. మరో వైపు తొలి పెళ్లి రోజు ప్రణయ్ లేకుండానే  జరుపుకోవడంపై  అమృత భావోద్వేగానికి గురైంది. అదే రోజున మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది.పెళ్లి రోజునే అమృత మగబిడ్డకు జన్మనివ్వడంతో ప్రణయ్ మళ్లీ పుట్టాడని కుటుంబసభ్యులు సంబరపడుతున్నారు. 

అమృత, ప్రణయ్ ల పెళ్లిరోజునే మళ్లీ ప్రణయ్ పుట్టాడు. అడుగడుగునా యుద్ధం చేసి ఉదయించాడు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. అమృత ఆత్మవిశ్వాసం, అపారమైన ధైర్యం పంచుకుని పుట్టాడు మృత్యుంజయుడు....న్యాయం కోసం, జీవించడం కోసం నిత్యం పోరాడుతూ ఊపిరి పోసుకున్న అమృత, బాలస్వామి, ప్రేమలత లకు అభినందనలు అంటూ పీఓడబ్ల్యూ నేత సంధ్య  ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లి రోజు.. ప్రణయ్ లేకుండానే..అమృత ఎమోషనల్ పోస్ట్

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu