దిగొచ్చిన కలెక్టర్ ఆమ్రపాలి

First Published Jan 20, 2018, 8:52 PM IST
Highlights
  • వారం లోగా భవనం కిరాయి చెల్లించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్

వరంగల్ అర్బన్ కలెక్టర్ దిగొచ్చారు. తను వినియోగించే ఫార్చూనర్ కారును జప్తు చేయాలంటూ కోర్టు ఆదేశించడంతో ఆమె స్పందించారు. ఐసిడిఎస్ భవనానికి వారంలోగా అద్దె చెల్లించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఐసీడీఎస్ భవనానికి సంబంధించి రూ. 3 లక్షలు అద్దె చెల్లించలేదంటూ కృష్ణారెడ్డి అనే యజమాని కోర్టును ఆశ్రయించాడు.

దీనిపై వాదనలు విన్న వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమ్రపాలి వినియోగిస్తున్న ఫార్చూనర్ కారును జప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమ్రపాలి.. వారంలోగా అద్దె చెల్లించాలని, దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడంతో ఈ వివాదానికి తెర పడినట్లైంది.

తెలంగాణలో డైనమిక్ ఆఫీసర గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండడమేంటని ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

click me!