తెలంగాణకు రూ.1,15,605 కోట్ల నిధులిచ్చాం : అన్ని స్థానాల్లో బిజెపి పోటీ : అమిత్ షా

By Arun Kumar PFirst Published Sep 15, 2018, 2:38 PM IST
Highlights

తెలంగాణ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటివరకు రూ.1,15,605 కోట్ల నిధులను తెలంగాణ కోసం ఖర్చు చేసినట్లు వివరించారు. అలాగే తెలంగాణకు ఎయిమ్స్, ఆదివాసీ, అగ్రికల్చర్,  పివి నరసింహారావు వెటర్నిటీ యూనివర్సిటిని మంజూరు చేయడంతో పాటు  బయోడైవర్సిటి, డిపెన్స్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతిచ్చినట్లు తెలిపారు. అలాగే 3 ఫుడ్ పార్కులను మంజూరు చేసినప్పటికి వాటిని ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. 

తాము తెలంగాణ అభివృద్ది కోసం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించారన్నారు.  కాబట్టి ప్రజలపై తమకు నమ్మకం ఉందని... అందువల్ల తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు.

అయితే కేవలం బిజెపి ప్రభుత్వం అమలుచేస్తుందన్న కారణంతోనే వివిధ పథకాలను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అమిత్ షా మండిపడ్డారు.  ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనకపోవడం దారుణమన్నారు. అలాగే ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇక బాలింతల కోసం చేపట్టిన మిషన్ ఇంద్రదనుస్సు ను 38 శాతం కూడా ఉపయోగించుకోలేదన్నారు. ఇలా ప్రజలకు ఉపయోగపడే పథకాలను తమ స్వార్థం కోసం దూరం పెట్టారని అమిత్ షా మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ తన 70 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. తాము ఓబిసి కమీషన్ ఏర్పాటుకు పార్లమెంట్ లో బిల్లు పెడితే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని గుర్తు చేశారు. అయినా తాము ఈ అడ్డంకిని దాటుకుని ఓబిసి కమీషన్ కు  రాజ్యాంగ హోదా కల్పించామన్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన తెలంగాణ వ్యక్తికి కనీస గౌరవం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వలేదని అమిత్ షా గుర్తు చేశారు.

click me!