కేసీఆర్ కు షాక్: ముస్లిం రిజర్వేషన్లపై తేల్చి చెప్పిన అమిత్ షా

By sivanagaprasad KodatiFirst Published Dec 2, 2018, 2:21 PM IST
Highlights

తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్ పేట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ ప్రజలపై వందల కోట్ల భారం మోపారన్నారు

తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్ పేట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ ప్రజలపై వందల కోట్ల భారం మోపారన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేటీఆర్, కవిత అధికారానికి దూరమవుతారని కేసీఆర్ భయపడ్డారని ఆయన మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన కేసీఆర్ హామీకి విఘాతం కలిగినట్లే భావించవచ్చు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అమిత్ షా అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించకపోగా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే నిధులను సైతం ప్రజలకు అందనివ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణ అమరవీరులకు చేసింది ఏం లేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మజ్లిస్‌కు భయపడి ఆ వేడుక జరపలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని జరుపుతామని అమిత్ షా హామీ ఇచ్చారు.

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ చెబుతున్నారు.. కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామని చెబుతోందని హామీ ఇస్తోందన్నారు.

చర్చిలకు, మసీదులకు ఉచితంగా కరెంట్ ఇస్తామంటున్నారు దేవాలయాలు ఏం పాపం చేశాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెబుతోంది.. మరి తెలుగు వచ్చిన వాళ్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ మైనారిటీల సేవలో తరిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. ఎవరు సీఎం అయినప్పటికీ తన కంట్రోల్‌లోనే పనిచేయాలని అసదుద్దీన్ ఒవైసీ చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నారాయణ పేట్ వాసులు తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. 
 

click me!