ఎన్నికళవేళ టీఆర్ఎస్ కి మరో షాక్..

Published : Dec 02, 2018, 02:20 PM IST
ఎన్నికళవేళ టీఆర్ఎస్ కి మరో షాక్..

సారాంశం

మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సమయంలో.. టీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది.

మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సమయంలో.. టీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది.  నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, నల్గొండ నియోజకవర్గ పార్టీ మాజీ ఇన్‌ఛార్జి దుబ్బాక నర్సింహారెడ్డి పార్టీని వీడారు. టీఆర్ఎస్ కీ, ఆ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. 

నల్గొండ అసెంబ్లీ టికెట్ తనకు దక్కుతుందని దుబ్బాక ఆశించారు. కానీ.. ఆ టికెట్ దక్కేలేదు. కనీసం   నామినేటెడ్ పదవి అయినా ఇస్తారని భావించాడు. కానీ ఆ హామీ నెరవేరేలా కనపడటం లేదని ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆయనకు అనుచర బలం ఉంది. ఆయన త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం