అమెరికా రోడ్డు ప్రమాదం...సాహిత్ కుటుంబసభ్యులను పరామర్శించిన తలసాని

By Arun Kumar PFirst Published May 14, 2019, 11:26 PM IST
Highlights

అమెరికా నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. ఉన్నతవిద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన బొంగుల సాహిత్ రెడ్డి రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వచ్చిన  ఓ కారు సాహిత్ రెడ్డిని  ఢీకొట్టడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. 
 
కొడుకు మరణవార్త గురించి తెలుసుకుని సాహిత్ తల్లిదండ్రులు లక్ష్మి, మధుసూదన్ రెడ్డిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. హుటాహుటిన హైదరాబాద్ ఆడిక్ మెట్ పద్మాకాలనీలోని వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఎంఎస్ చదవడానికి వెళ్లిన సాహిత్ అక్కడే అకాలమరణం పొందడంపై వారు విచారం వ్యక్తం చేశారు.   

తమ కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి  తొందరగా చేరుకునేలా చూడాలని తల్లిదండ్రులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ...సాహిత్ మృతదేహాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్వదేశానికి తీసుకురాడానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. అమెరికా రాయబార కార్యాలయంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. లీగల్ ప్రక్రియ ముగిసిన తర్వాత సాహిత్ రెడ్డి మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంటుందని  తలసాని తెలిపారు. 
 
click me!