అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన పెను ప్రమాదం

Published : Dec 19, 2019, 01:03 PM ISTUpdated : Dec 19, 2019, 03:04 PM IST
అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన పెను ప్రమాదం

సారాంశం

పీఆర్ గెస్ట్ హౌజ్ లో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కుల పంపిణీ కోసం గురువారం  ఎమ్మెల్యే  సునీత అక్కడికి వచ్చారు. అదే సమయంలో బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు ఊడి ఆమెపై పడ్డాయి. 


ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కు పెను ప్రమాదం తప్పింది. ఆమెపై భనవం పెచ్చులు ఊడిపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..  ఆలేరులోని పీఆర్ గెస్ట్ హౌజ్ లో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కుల పంపిణీ కోసం గురువారం  ఎమ్మెల్యే  సునీత అక్కడికి వచ్చారు. అదే సమయంలో బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు ఊడి ఆమెపై పడ్డాయి. 

ఈ ఘటనలో మోరిగాడి ఇందిర అనే కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఎమ్మెల్యే సునీత కు చేతికి గాయమైంది. కాగా... ఇద్దరినీ అధికారులు చికిత్స నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్