తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేయనున్న ఏఐఎంఐఎం..

Published : Oct 23, 2022, 02:35 PM IST
తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేయనున్న ఏఐఎంఐఎం..

సారాంశం

AIMIM: హైద‌రాబాద్ పార్లమెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఒవైసీ నాయ‌క‌త్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) రానున్న తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టినుంచే ఫోక‌స్ పెట్టింది. ఈ క్ర‌మంలోనే పోటీ చేసే స్థానాల్లో గెలుపునకు వ్యూహాల‌ను సిద్దంచేస్తోంది.

Telangana assembly Election: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఇప్ప‌టికే నుంచే రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల గెలుపునకు వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ పార్లమెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ నాయ‌క‌త్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టింది. పోటీ చేసే స్థానాల్లో గెలుపు వ్యూహాల‌ను ర‌చిస్తోంది. 

తెలంగాణలోని 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టినుంచే సీట్ల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ..  తెలంగాణలో ఏఐఎంఐఎం విస్తరణకు ప్ర‌ణాళికలు ర‌చిస్తున్నారు. ఇదివ‌ర‌కు పోటీ చేసిన స్థానాలు మాత్ర‌మే కాకుండా మ‌రిన్ని స్థానాల్లో పోటీ చేయ‌డానికి వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని స‌మాచారం. దర్-ఉస్-సలామ్‌లోని జల్సా రెహ్మతుల్లా ఉల్లామిన్‌ను ఉద్దేశించి అసదుద్దీన్ ఒవైసీ తన ప్రసంగంలో, స్థానిక సమస్యలను మీడియా ద్వారా అందించాలని పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా జిల్లాల కార్యకర్తలకు సూచించారు.

ముస్లిం ఆధిపత్య స్థానాలతో పాటు కొన్ని వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేయబడిన అసెంబ్లీ నియోజకవర్గాల నుండి హిందూ అభ్యర్థులను పోటీకి దింపేందుకు ప్రణాళికలు వివిధ జిల్లాలు, న‌గ‌ర‌ శివారు ప్రాంతాలలో ప్రక్రియలో ఉన్నాయి. జిల్లాల్లో ఇప్పటి వరకు 17 అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజామాబాద్ (అర్బన్), సంగారెడ్డి, కరీంనగర్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ముధోలే, ఆదిలాబాద్, కాగజ్ నగర్, కోరుట్ల, భోంగీర్, వరంగల్ (తూర్పు), మెహబూబ్ నగర్, ఖమ్మం, జహీరాబాద్, వికారాబాద్, షాద్ నగర్ సహా ప‌లు జిల్లాలను సమీక్షిస్తున్నారు.

ఈ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఏఐఎంఐఎం కన్ను వేసి తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు వ్యూహం అమలు చేస్తోంది. పార్టీ కార్యకలాపాలను జిల్లాల వారీగా విస్తరింపజేసి, పార్టీ క్యాడర్‌ను పటిష్టం చేసేందుకు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తోంది. కొంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను పార్టీలో చేర్చుకుని ఎన్నికల రంగంలోకి దించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం. "రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏఐఎంఐఎం ఒక ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసింది. గ్రౌండ్‌వర్క్‌పై తన దృష్టిని కేంద్రీకరించింది. ఈసారి పార్టీ దృష్టి ముస్లింలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లపైనే ఎక్కువగా దృష్టి సారించ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోంద‌ని" పార్టీలోని ప‌లు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ఏఐఎంఐఎం  ఉంది. ఇది 2019 అసెంబ్లీలో నిజామాబాద్ (అర్బన్) నుండి మీర్ మజాజ్‌ను అభ్యర్థిగా నిల‌బెట్టింది. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆయ‌న రెండో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఇక్క‌డ టీఆర్‌ఎస్‌కు 31.15 శాతం ఓట్లు రాగా, ఏఐఎంఐఎం అభ్యర్థికి 23.53 శాతం ఓట్లు వచ్చాయి.

బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నిజాం మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 50 స్థానాల్లో ఏఐఎంఐఎం 16 స్థానాలను కలిగి ఉంది, ఇక్కడ మున్సిపాలిటీలోని 38 వార్డులలో 11 వార్డులను పార్టీ కలిగి ఉంది. ఇది భింసా మునిసిపాలిటీపై బలమైన పట్టును కలిగి ఉంది.  అలాగే, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 6 మంది ఏఐఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను త‌మ‌వైపున‌కు తిప్పుకోవాల‌ని ఏఐఎంఐఎం వ్యూహాలు ర‌చిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?