భారత్ జోడో యాత్రకు ప్రచారం ఏది .. నీకైతే పబ్లిసిటీ కావాలా : రేవంత్‌పై కేసీ వేణుగోపాల్ అసహనం

By Siva KodatiFirst Published Oct 13, 2022, 9:25 PM IST
Highlights

రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్రకు తెలంగాణ ప్రచారం లభించకపోవడం పట్ల ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. పబ్లిసిటీలో ముందుంటావ్ అని.. జోడో పబ్లిసిటీలో ఎందుకు వెనుకబడ్డావ్ అని రేవంత్‌ను వేణుగోపాల్ ప్రశ్నించారు.

గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై ఆయన చర్చించారు. రాహుల్ పాదయాత్ర ముగిసేవరకూ తెలంగాణ విడిచి వెళ్లొద్దని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ని ఆయన ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని వేణుగోపాల్ అన్నారు. మాకొచ్చిన నివేదిక ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆయన పేర్కొన్నారు. 

భారత్ జోడోకు విస్తృతమైన ప్రచారం చేయాలని వేణుగోపాల్ ఆదేశించారు. జోడో ప్రచారంలో తెలంగాణ పీసీసీ వెనుకబడి వుందని.. రేపటి నుంచి గ్రామస్థాయికి వెళ్లేలా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. రేవంత్ పబ్లిసిటీలో ముందుంటావ్ అని.. జోడో పబ్లిసిటీలో ఎందుకు వెనుకబడ్డావ్ అని ఆయనను వేణుగోపాల్ ప్రశ్నించారు. ఇదే సమయంలో కేసీ వేణుగోపాల్‌ని పొగడ్తలతో ముంచెత్తారు మాజీ ఎమ్మెల్యే వంశీ. ఇప్పుడు తన గురించి ఎందుకు.. యాత్ర గురించి మాట్లాడాలని ఆయన చురకలు వేశారు. 

Also REad:24న కాదు.. ఒకరోజు ముందుగానే తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర, షెడ్యూల్ ఇదే

ఇకపోతే.. ఒకరోజు ముందుగానే తెలంగాణలోకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేరుకోనుంది. ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ గాంధీ ఎంటర్ కాబోతున్నారు. 23న హాఫ్ డే మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తారు. 24, 25న పాదయాత్రకు బ్రేక్ వుంటుంది. 26 నుంచి రాహుల్ యాత్ర తిరిగి కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణ కాంగ్రెస్‌కు బూస్టప్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు నేతలు. సక్సెస్ చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. మొత్తం 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ముక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. 

అయితే తొలుత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..  ఔటర్ రింగ్ రోడ్, వికారబాద్‌ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజా రూట్ మ్యాప్ ప్రకారం.. రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్, ఆరామ్‌గఢ్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, మోజంజాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు సహా నగరంలోని ప్రధాన ప్రాంతాల గుండా వెళుతుంది. అయితే చార్మినార్‌ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర వెళ్లనున్న నేపత్యంలో.. అక్కడి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాహుల్ సందర్శించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

click me!