కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం: ఆరు జిల్లాలకు అధ్యక్షులు వీరే

Published : Oct 10, 2019, 03:57 PM ISTUpdated : Oct 10, 2019, 04:14 PM IST
కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం: ఆరు జిల్లాలకు అధ్యక్షులు వీరే

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించింది ఎఐసీసీ. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా  కాంగ్రెస్ పార్టీ  ప్రయత్నాలను ప్రారంభించింది.ఇందులో భాగంగానే పార్టీకి కొత్త నాయకత్వాన్ని అందించాలని భావిస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన  తర్వాత పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరారు. దీంతో పార్టీని మరో నాలుగేళ్ల పాటు  నడిపించేందుకు కొత్త నాయకత్వం కోసం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్వేషణ ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో కొత్త వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

మిగిలిన జిల్లాలకు కూడ కొత్త వారికి బాధ్యతలను అప్పగించనున్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో కూడ నాయకత్వ మార్పు ఉంటుందా అనే చర్చ కూడ లేకపోలేదు.


కొత్త అధ్యక్షులు వీరే  

ఆసిఫాబాద్- విశ్వప్రసాదరావు
భూపాలపల్లి-ప్రకాష్‌రెడ్డి
వికారాబాద్- రామ్మోహన్ రెడ్డి
ములుగు-కుమారస్వామి
నారాయణపేట- శివకుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా-కుంభం అనిల్ కుమార్ రెడ్డి
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu