అయోధ్యపై సుప్రీం తీర్పు... ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న అసదుద్దీన్

Published : Nov 13, 2019, 01:30 PM ISTUpdated : Nov 17, 2019, 04:16 PM IST
అయోధ్యపై సుప్రీం తీర్పు... ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న అసదుద్దీన్

సారాంశం

5 ఎకరాల భూమి కేటాయింపు రిజెక్ట్ చెయ్యాలన్నారు. వేరే చోట మసిద్ మేము కట్టుకోగలమని అన్నారు. 5వందల సంవత్సరాల మసిద్ చరిత్ర ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ కానీ ఇంఫాయిలబుల్ గా ఉందన్నారు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నారు. #IamAsadOwaisi పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతోంది. అయోధ్య తీర్పు విషయంలో అసదుద్దీన్ తన అభిప్రాయాన్ని తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ అభిప్రాయం తర్వాత.. ఆయనకు వ్యతికేరంగా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ప్రత్యక్షమయ్యాయి. దీంతో.. ఆయనకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు IamAsadOwaisi అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే...ఇటీవల సుప్రీం కోర్టు అయోధ్యలో రామ మందిరానికి అనుమతి ఇస్తూ... మసీదు నిర్మాణానికి ప్రత్యేకంగా ఐదు ఎకరాలు భూమి కేటాయిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ తీర్పు పట్ల అసదుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాము  ఎవ్వరి దగ్గర భిక్ష కోసం పోరాటం చేయలేదని అసదుద్దీన్ పేర్కొన్నారు. 5 ఎకరాల భూమి కేటాయింపు రిజెక్ట్ చెయ్యాలన్నారు. వేరే చోట మసిద్ మేము కట్టుకోగలమని అన్నారు. 5వందల సంవత్సరాల మసిద్ చరిత్ర ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ కానీ ఇంఫాయిలబుల్ గా ఉందన్నారు. శాంతి భద్రతలను, ఎవ్వరిని రెచ్చగొట్టడానికి తాను ఇలా మాట్లాడటం లేదన్నారు. సుప్రీంకోర్టు పై తనకు అపారమైన గౌరవం ఉంది భవిష్యత్ లో ఉంటుందని చెప్పారు.
మాజీ జస్టిస్ వర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవవిస్తున్నానని చెప్పారు.

AlsoRead అయోధ్యపై సుప్రీం తీర్పు... అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి...

 భారత్ ను హిందుఇజం నుంచి కాపాడాలన్నారు తాము కాంగ్రెస్ తో ఎందుకు కలుస్తాము?..కాంగ్రెస్ బీజేపీ తో కలిసిపోయిందన్నారు. భారత్ ను రక్షించేందుకు ధర్మం, న్యాయం ఉందని వెల్లడించారు. సంఘ్ పరివార్ రాబోయే రోజుల్లో మసిద్ లను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. ముస్లిం ఎవ్వరికి బయపడొద్దు..భయపడి బతకాల్సిన అవసరం లేదన్నారు.

కాగా.. అసదుద్దీన్ చేసిన కామెంట్స్ పై పలువురు బీజేపీ నేతలు, హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ని అరెస్టు  చేయాలని కూడా చేశారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో అసదుద్దీన్ ని అరెస్టు చేయాలి, అసదుద్దీన్ యాంటీ నేషలిస్ట్ పేరిట రెండు ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా రెండు ట్యాగ్స్ ట్రెండ్ అవుతుండటంతో ఆయన మద్దతుదారులు రంగంలోకి దిగారు.  #IamAsadOwaisi ని ఆయనకు మద్దతుగా ట్రెండ్ అయ్యేలా చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్