గుడ్ల దాడి తర్వాత కత్తి మహేష్ ఏం చేశాడో తెలుసా ?

Published : Jan 18, 2018, 10:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
గుడ్ల దాడి తర్వాత కత్తి మహేష్ ఏం చేశాడో తెలుసా ?

సారాంశం

దాడి జరిగినా బెదరని కత్తి కోడిగుడ్ల పొట్టు, సొన తూడ్చుకుని లైవ్ షో కు హాజరు దాడి పిరికి చర్యగా అభివర్ణించిన కత్తి  

ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద ఒంటరి పోరా టం చేస్తున్న కత్తి మహేష్ మీద దాడి జరిగింది. ఆయన 99 టివిలో చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లుండగా కొండాపూర్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కత్తి మహేష్ మీద కోడిగుడ్లు పడి పగిలిపోయాయి. కారుపైనా కోడిగుడ్లు పడ్డాయి. దాడి చేసిన వారి వివరాలు అందలేదు. అయితే వారు కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అయి ఉంటారని చెబుతున్నారు.

కత్తి మహేష్ పై దాడి జరిగిన తర్వాత ఆయన అదరకుండా బెదరకుండా వ్యవహరించారు. కోడిగుడ్ల సొన, కోడిగుడ్ల పొట్టు తూడ్చుకుని అదే ఊపులో 99 టివి చానెల్ లో లైవ్ షో లో పాల్గొన్నారు. మొహంపై కారుతున్న కోడిగుడ్ల సొనను తూడ్చివేసి లైవ్ షోలో తనపై దాడి జరిగిన వివరాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డారు. పిరికివాళ్లే తనమీద దాడి చేశారని.. వాళ్లకు దమ్ముంటే తన మీద దాడి చేసిన తర్వాత అక్కడే ఉండేవాళ్లు కదా అని ప్రశ్నించారు. అంతేకాదు తాను దళితుడిని అయినందుకే దాడి చేశారని కూడా హాట్ కామెంట్స్ చేశారు.

ఓయు జెఎసి ఖండన

కత్తి మహేష్ మీద దాడిని ఓయు జెఎసి తీవ్రంగా ఖండించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారని ఓయు జెఎసి ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడికి నిరసనగా రేపు తెలంగాణ అన్ని జిల్లాల్లో పవన్ దిష్టిబొమ్మలు కాలబెట్టాలని పిలుపునిచచ్చింది ఓయు జెఎసి.

మొత్తానికి ఇంతకాలం పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్న కత్తి మహేష్ పోరాటం రానున్న రోజుల్లో కొత్త మలుపు తిరిగే చాన్స్ ఉందని చెబుతున్నారు. కోడిగుడ్ల దాడి ఘటనతో కత్తి మహేష్ మరింత కసిగా చెలరేగిపోయే అవకాశం ఉందని ఓయు జెఎసి నేతలు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే