న్యాయవాది కీచకబుద్ధి: కన్నకూతురిపైనే అత్యాచారం

Published : Nov 19, 2020, 07:14 AM IST
న్యాయవాది కీచకబుద్ధి: కన్నకూతురిపైనే అత్యాచారం

సారాంశం

ఓ వ్యక్తి న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చే నీచమైన కార్యానికి పూనుకున్నాడు. కన్నకూతురిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది. న్యాయవ్యాద వృత్తికే మచ్చ తెచ్చే పనికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. అత్యంత దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడు. కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని హైదర్ షా కోటలో గల కపినగర్ కాలనీలో నివాసం ఉంటున్న సత్యనారాయణ గౌడ్ వరంగల్ జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నాడు. 

అతను తన కూతురిని బెదిరిస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దాంతో తల్లి మంజుల కూతురిని నిలదీసింది. 

తల్లి పట్టుబట్టడంతో తండ్రి చేస్తున్న నీచమైన కార్యాన్ని వివరించింది. దాంతో మంజుల భర్తపై నార్సింగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భర్త వల్ల కూతురికి రక్షణ లేదని ఆమె చెప్పింది.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?