కేసీఆర్ కు దెబ్బమీద దెబ్బ ... బిఆర్ఎస్ కు మరో కీలక నేత గుడ్ బై

By Arun Kumar P  |  First Published Dec 24, 2023, 11:50 AM IST

మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా తయారయ్యింది బిఆర్ఎస్ పరిస్థితి. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ కీలక నాయకులు కూడా వీడుతుండటం కంగారు పెట్టిస్తోంది. 


ఆదిలాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఓటమి తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీలో పరిస్ధితులు మారుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వలసలు సాగితే ప్రస్తుతం రివర్స్ లో జరుగుతోంది. అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ లోంచి పవర్ లో వున్న కాంగ్రెస్ లో చేరేందుకు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ ను వీడగా తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కీలక నేత కూడా రాజీనామా చేసారు. 

బిఆర్ఎస్ పార్టీకి చెందిన భోజారెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ డిసిసిబి ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అధికార కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తనకు డిసిసిబి ఛైర్మన్ గా అవకాశం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు... త్వరలోనే భోజారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. 

Latest Videos

బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు భోజారెడ్డి స్వయంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపినట్లు వెల్లడించారు. ఇంతకాలం తనను సహకరించిన బిఆర్ఎస్ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ ను ప్రకటించనున్నట్లు డిసిసిబి ఛైర్మన్ తెలిపారు. 

Also Read  తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు మహిళ చేతికి... ఎవరీ దీపాదాస్ మున్షీ?

అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే త్వరలోనే జరగనున్న లోక్ సభ పోరులోనూ పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే పార్టీ కాస్త బలహీనంగా వున్న ప్రాంతాల్లో ఇతరపార్టీల నుండి వలసలను ఆహ్వానిస్తోంది. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ తాజాగా డిసిసిబి ఛైర్మన్ భోజారెడ్డితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అతడి రాజకీయ భవిష్యత్ గురించి హామీనిచ్చి కాంగ్రెస్ లో చేరేందుకు ఒప్పించినట్లు  తెలుస్తోంది. 

ఇదిలావుంటే ఇప్పటికే సింగరేణి కార్మికసంఘం ఎన్నికలకు దూరంగా వుండాలన్న బిఆర్ఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కీలక నాయకులు రాజీనామా చేసారు. బిఆర్ఎస్ కార్మిక విభాగం TBGKS అధ్యక్షుడు వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పార్టీని వీడారు. ఎన్నికల్లో పోటీచేయని బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘంలో వుండలేకపోతున్నామని... అందువల్లే రాజీనామా చేసినట్లు టిబిజికెఎస్ నాయకులు తెలిపారు. తాముమాత్రమే కాదు టిబిజికెఎస్ ను నమ్ముకున్న కార్మికులు సైతం బిఆర్ఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కారణం ఏదైనా ఎన్నికల్లో పోటీకే దూరంగా వుండాలన్న నిర్ణయం సరికాదని కార్మికసంఘం నాయకులు అంటున్నారు. 

ఇప్పటికే తమ రాజీనామా లేఖలను టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత కు పంపినట్లు నాయకులు తెలిపారు. తమతో పాటే కార్మికులు కూడా టిబిజికెఎస్ కు దూరం కానున్నారని... మూకుమ్మడిగా యూనియన్ కు రాజీనామా చేస్తున్నామని అన్నారు. వీరంతా కాంగ్రెస్ అనుబంధ కార్మికసంఘ ఐఎన్టియూసి(ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) చేరనున్నట్లు తెలుస్తోంది. 
  

  

click me!