బీజేపీ బుల్డోజర్లు పెట్టి లేపినా లేవడం లేదు.. కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌కు కోవర్టు కాదా?: అద్దంకి దయాకర్

By Sumanth KanukulaFirst Published Apr 22, 2023, 12:31 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ బుల్డోజర్లు పెట్టిన లేపిన లేవడం లేదని విమర్శించారు. 

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ బుల్డోజర్లు పెట్టిన లేపిన లేవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ బలపడటంతో బీజేపీలో భయం కనిపిస్తోందని అన్నారు. ఈటల రాజేందర్ ప్రస్టేషన్‌తోనో లేదా వార్తల్లో నిలవాలనో మాట్లాడినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. 
ఎవరో పనికిమాలినొళ్లు సలహా ఇస్తే ఈటల  బీజేపీలో చేరారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలని ఈటల కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. 


బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లోకి వస్తానని రేవంత్ రెడ్డిని సంప్రదించిండం జరిపింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో రావడానికి సి్దపడిన తర్వాత వ్యాపారాలను కాపాడుకోవడానికి వ్యక్తిగత  స్వార్ధం కోసం బీజేపీలోకి వెళ్లారని విమర్శించారు. బీజేపీ రూ. 18 వేల కోట్లు పెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కొనుగోలు చేసిందని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి దివాళాకోరు మాటలు మానాలని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

Latest Videos

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌కు కోవర్టు కాదా? అని  ప్రశ్నించారు. కేంద్రంతో కేసీఆర్‌కు సమస్యలు రాకుండా  చూసేది కిషన్ రెడ్డి అని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి నష్టం కలగకుండా చేసేది కేసీఆర్ అని  విమర్శించారు. రేవంత్ రెడ్డి  సవాలను ఈటల రాజేందర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈటల చెప్పే మాటలు నిజమైత ఆయన భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని అన్నారు. 
 

click me!