ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ.. తమిళనాట బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నారా..?

Published : Jan 28, 2023, 10:08 AM IST
ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ.. తమిళనాట బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నారా..?

సారాంశం

తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ కలిశారు.

తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ కలిశారు. శనివారం ఉందయం కవితతో శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారు దేశ రాజకీయాల గురించి చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు , ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షునిగా ఉన్న ఆయన కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బీఆర్ఎస్‌గా జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణకు సంబంధించి విషయాల్లో కేసీఆర్ కూతరు, ఎమ్మెల్సీ కవిత కూడా కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితతో శరత్ కుమార్ భేటీ కావడంపై వెనక తమిళనాట బీఆర్ఎస్ విస్తరణ వ్యుహాలు కూడా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసేందుకు శరత్ కుమార్ సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్