పోలీసులతో రాకేశ్ రెడ్డికి లింకులు: ఒకరిపై వేటు మరోకరిపై రంగం సిద్ధం

Published : Feb 04, 2019, 09:32 PM IST
పోలీసులతో రాకేశ్ రెడ్డికి లింకులు: ఒకరిపై వేటు మరోకరిపై రంగం సిద్ధం

సారాంశం

మరోవైపు నిందితుడితో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించిన వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ నల్లకుంట ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ పై బదిలీవేటు వేసింది. రాకేష్ రెడ్డి కాల్ లిస్ట్ లో శ్రీనివాస్ నంబర్ ఉండటంతో క్రిమినల్ తో కాంటాక్ట్ లో ఉన్నందుకు శ్రీనివాస్ పై బదిలీ వేటు పడినట్లు సమాచారం. 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం కేసులో కీలక నిందితుడు రాకేష్ రెడ్డి పోలీస్ శాఖలు గుబులు రేపుతున్నాడు. హత్యకేసులో పోలీసులకు చుక్కలు చూపించి ఎట్టకేలకు అడ్డంగా బుక్కైన రాకేశ్ రెడ్డి ఆ పోలీస్ శాఖలోనే కలకలం రేపుతున్నాడు. 

పోలీసుల విచారణలో పోలీస్ శాఖలో పలువురితో రాకేష్ రెడ్డి లింకులు ఉన్న విషయం బట్టబయలైంది. రాకేష్ రెడ్డి కాల్ లిస్ట్ లో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు పోలీసుల ఫోన్ నంబర్లు ఉండటం పోలీసులను విస్మయానికి గురి చేసింది. 

ఈ అంశంపై ఆరా తియ్యగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులతో రాకేష్ రెడ్డి సత్సమ సంబంధాలు నెరిపినట్లు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాకేష్ రెడ్డితో సంబంధాలు ఉన్న పోలీసుల చిట్టాను తయారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు నిందితుడితో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించిన వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ నల్లకుంట ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ పై బదిలీవేటు వేసింది. రాకేష్ రెడ్డి కాల్ లిస్ట్ లో శ్రీనివాస్ నంబర్ ఉండటంతో క్రిమినల్ తో కాంటాక్ట్ లో ఉన్నందుకు శ్రీనివాస్ పై బదిలీ వేటు పడినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ శివారులోని ఓ ఏసీపీపై కూడా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!